Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల తర్వాత వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం

-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంక రోజులే
– ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి , సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్చిలో ప్రార్థన నిర్వహించి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా అభ్యర్థించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు

సిద్ధం సభల పేరుతో ప్రజల్ని కష్టాలపాలు చేస్తూ వారిపై యుద్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సభలను వందల కోట్లు వెచ్చించి నిర్వహిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంక రోజులే మిగిలి ఉన్నాయి. ఎన్నికల తర్వాత బంగాళాఖాతంలో కలిపేస్తాం. ప్రజలు మిమ్మల్ని నమ్మే రోజులు పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అట్టడుగున ఉంది. ఆఖరికి సచివాలయాలు తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి చరిత్రలో ఈయన ఒక్కడే.

తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే మీరు ఏమి చేశారో చెప్పాలని.తెలుగుదేశం పార్టీ టైంలో కట్టిన గృహాలకి మీరు రంగులు వేయటం తప్ప ఏమి చేశారని. బీసీలను దళిత మైనారిటీ వర్గాలను మోసం చేసిన ఘనత ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెందుతుంది.. చంద్రబాబు నాయుడు -పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉందని, రాష్ట్రంలోని ప్రజలందరూ తెలుగుదేశం జనసేన కూటమికి బ్రహ్మరథం కడతారని. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర,జిల్లా నాయకులు దళిత మైనారిటీ నాయకులు జనసేన నాయకులు మహిళా నాయకురాలు దివ్య కోలు చింతపల్లి శ్రీను, యెల్లినేడి మల్లికార్జునరావు,దివ్య కోలు భాస్కరరావు, చింతపల్లి లక్ష్మయ్య,కోట వీరయ్య,చింతపల్లి చిన్న లక్ష్మయ్య, యర్ర ఎద్దుల మల్లారెడ్డి, యర్రఎద్దుల కరుణాకర్ రెడ్డి, బండి పిచ్చయ్య, దామా శ్రీనివాసరావు, షేక్ బాబు, షేక్ ఛాంస, మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE