ఎన్నికల్లో ఆశీర్వదించండి.. మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తా

-దుర్మార్గ అరాచకాలకు కేరాఫ్ మంత్రి కాకాని
– తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గాన్ని దుర్మార్గాలకు, అరాచకాలకు మంత్రి కాకాని కేరాఫ్ గా మార్చారని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కాకాని పుణ్యమా అంటూ అన్ని వర్గాల ప్రజలు బలైపోయినారు. 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలను, సబ్సిడీ ఎత్తేసి ఆక్వా రంగాన్ని జగన్ నట్టేట ముంచేస్తే కంటైనర్ టెర్మినల్ తరలిపోతే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాననీ ప్రగల్భాలు పలికి 10 వేల మంది ఉద్యోగుల పోట్టకొటింది నీవు కాదా కాకాణి?

వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి అసమర్థత వలన సోమశిల నుండి లక్షల క్యూసెక్ నీళ్లు సముద్ర పాలు అయ్యాయి. నీళ్ళు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కానీ కాకాణి కానీ ఏం చేస్తున్నారు. బూతు పురాణాలు మాని రాజకీయాలలో హుందాగా మెలగాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం సమయానికి జీతాలు కూడా ఈ ప్రభుత్వ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. కాకానికి మరోసారి అవకాశం ఇస్తే కిరాయి గుండాలాగా మారి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అమ్మకానికి పెడతారన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించండి.. మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తానని ప్రజలను కోరిన సోమిరెడ్డి

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, బాబు నాయుడు, మనోహర్ గౌడ్, చినబాబు రెడ్డి, భూపేంద్ర నాయుడు, హరిచంద్రా రెడ్డి, రమణయ్య నాయుడు, మోహన్ రావు, అనీల్ చౌదరి, సురేష్ గౌడ్, ఏంబేటి మస్తానయ్య,మండల, గ్రామాల నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply