హిప్పీ అంటే బప్పీ..
శాస్త్రీయంలో లహరి..
మొత్తంగా సంగీత ప్రపంచాన్ని పాటలతో
ఉర్రూతలూగించిన
స్వర సామ్రాట్టు..
డిస్కో మ్యూజిక్ కు
మూలవిరాట్టు..
బప్పీలహరి..
ఓ సంగీత ఝరి..!
ఇట్స్ డి..ఐ..ఎస్..సి..ఒ..
అయామె డిస్కో డాన్సర్..
గెటప్పే అదోలాంటి సెటప్పు..
మ్యూజిక్కుకి తగిన మేకప్పు
డ్రమ్సు కొడితే
అదిరిపోయే పైకప్పు..
దటీజ్ బప్పీ లహరి..
సంగీతలోక ఆనందవిహారి!
పాటలకు కుర్రకారు ఊగిపోవాలంటే
నిర్మాతదర్శకుల
తొలి పిలుపు బప్పీకే..
బాక్సాఫీసు బద్దలైనట్టే
ఎన్ని పాటలంటే అన్నీ హిట్టే!
భాష రాని తెలుగులోనూ
ఓ వెలుగే..
సూపర్ స్టార్ పిలుపుతో
బొంబాయి నుంచి
వస్తే మదరాసు
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది
ఈ వేళ
అంటూ కృష్ణ వేస్తే సింహాసనం..
అందించలేదా పంచరత్నాలు
ఇప్పటికీ పెళ్లి మేళాల్లో వినిపించే
చుమ్ నన చుమ్ నాదాలు..!
వానా వానా వెల్లువాయే
చిలుకా క్షేమమా..
చిరు జోరుకి తగిన హోరు..
బాలయ్యకూ ఓ హిట్టు..
అందులోనూ వాన పాటతో
డాన్సులో యువరత్న
ఎక్కలేదా మరో మెట్టు..
బప్పీ సంగీతం
తెలుగోళ్లకు ఉప్మాపెసరట్టు
బాలీవుడ్లో యాభై సినిమాలు
హిట్టు మీద హిట్టు..!
బప్పీలహరికి
నివాళి అర్పిస్తూ..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286