Suryaa.co.in

Telangana

మున్నూరు కాపు మహిళ విభాగం ఆధ్యర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు

మున్నూరు కాపు మహిళ విభాగం ఆధ్యర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను లోయర్ ట్యాంక్ బండ్ లోని అల్ ఇండియా కాపు బలిజ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు . తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కుimage-2ప్ర‌తీక‌.. మ‌న ఆడ‌ప‌డుచుల ఆత్మ‌గౌర‌వాన్ని చాటే పూలవేడుక‌.. బతుకమ్మ పండుగ ఈ కార్యక్రమానికి తెలంగాణ లో అన్ని జిల్లా నుంచి మున్నూరు కాపు సంఘ మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ , మహిళ గౌరవ అధ్యక్షురాలు, మహిళ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత , మున్నూరు కాపు గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ బండారి లత, కొండా దేవయ్య, శ్వేత, ప్రమీల, కవిత, పద్మ వివిధ రంగాలలో పనిచేస్తున్న రాజకీయ, లాయర్స్, డాక్టర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బండారి లత మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మimage-1పండుగ, మున్నూరు కాపు సంఘం కుటుంబ వాతావరణంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న మున్నూరు కాపుల స్ఫూర్తితో పనిచేద్దామని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE