Suryaa.co.in

Telangana

పద్మారావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుక

సీతాఫల్మండి లోని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమానికి అయన సతీమణి తీగుల్ల స్వరూప గౌడ్ హాజరై ఈ వేడుకలను ప్రారంభించారు. తీగల్ల పద్మారావు గౌడ్ కుమార్తె కుమారి మౌనిక గౌడ్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునిత, తెరాస యువ నేత త్రినేత్ర గౌడ్ పాటు పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. బతుకమ్మ ఆటపాటలతో సీతాఫలమండి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. పద్మారావు గౌడ్ కోడళ్ళు, కుటుంబ సభ్యులు సందడి చేశారు.

LEAVE A RESPONSE