Suryaa.co.in

Features

ఆఫ్ఘనిస్తాన్‌… ఓ సనాతన ధర్మక్షేత్రం!

ఆఫ్ఘనిస్తాన్‌ పేరు చెప్పగానే ఓ ముస్లిం దేశంలా మస్తిష్కంలో మెదులుతుంది. మహమ్మద్‌ ఘజనీ వంటి క్రూరుల అరాచక పాలన గుర్తుకొస్తుంది. కానీ, ఒకప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్‌ సనాతన ధర్మ క్షేత్రమని మీకు తెలుసా? హిందూ రాజుల ఏలుబడిలో ఎంతో సుసంపన్నంగా వర్ధిల్లిన ప్రాంతమని మీరు ఎరుగుదురా? ప్రస్తుతం తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతన్న ఆ నేలపై ఒకప్పుడు హిందూ ధర్మం వర్ధిల్లింది. శాంతి, సౌభ్రాతృత్వం విలసిల్లాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తిగా ఇస్లామిక్‌ తీవ్రవాదుల వశమైంది. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో మిగిలివున్న సాంస్కృతిక వారసత్వం కూడా నాశనమవుతోంది. హిందువులు, సిక్కులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోవాల్సివచ్చింది.
1970 లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఏడు లక్షల మంది సిక్కులు, హిందువులు ఉండేవారు. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి మైనార్టీలు మైనార్టీ జనాభా వందల్లోకి పడిపోయింది. భారత సంతతికి చెందిన ఈ మైనార్టీలేమయ్యారు..? నేడు, ఆఫ్ఘనిస్తాన్‌లో మిగిలి ఉన్న ఆ కొద్దిమంది ధార్మిక మైనారిటీలు తమ స్వదేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఇదీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితి. కానీ, ఇదే మైనార్టీ హిందువులతో ఆఫ్ఘనిస్తాన్‌ ఒకప్పుడు శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లింది. హిందూ షాహీల పాలనలో సంస్కృతి, వారసత్వ సంపదతో తులతూగింది.
అఖండ భారత చిత్రపటంలో ఆఫ్ఘనిస్తాన్‌ కూడా భాగమే. భారత ఉపఖండం సనాతన ధర్మంతో పరిమళించింది. అందుకే ఇస్లామిక్‌ దోపిడీదారులు భారత ఉపఖండాన్ని ఎప్పుడూ ద్వేషిస్తారు. ఇస్లామిక్‌ దోపిడీదారుల దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్‌.. జయించాలనుకున్న ఓ భూమి మాత్రమే. కానీ, భారత ఉపఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన ఈ భూమి.. ఒకప్పుడు సనాతన ధర్మక్షేత్రం. సంపన్న నాగరికత కలిగిన ప్రాంతం. మధ్యయుగ క్రూరులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు వరకు.. ఇక్కడ ఇస్లామిక్‌ కాలిఫేట్‌ పతాకం ఎగరకముందు వరకు.. హైందవం, బౌద్ధం వెల్లివిరిసిన ప్రాంతమిది.
ఏడో శతాబ్దంలో ప్రస్తుతం ఇరాన్‌లోని నిహవాండ్‌లో.. సస్సేనియన్‌ పర్షియన్లను ఓడిరచిన రషీదున్‌ కాలిఫేట్‌ అరబ్బులు తొలిసారి నేటి ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టారు. ఆ విధంగా, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువుల సాంస్కృతిక మారణహోమానికి బీజాలు పడ్డాయి. ‘ఆఫ్ఘనిస్తాన్‌’ అనే పేరు ‘ఉప-గణ-స్తాన్‌’ అనే పదం నుండి వచ్చింది. సంస్కృతంలో సంస్కృతంలో ‘ఉప-గణ-స్తాన్‌’ అంటే గిరిజన తెగలు నివసించే ప్రాంతమని అర్థం.

ఇది మహాభారతంలోని గాంధారికి చెందిన ప్రదేశం. దీనిని మొదట్లో గండహార్‌ అని పిలిచేవారు. శకుని కుట్రలకు వేదికైన ఈ గండహార్‌ కాలక్రమంలో కాందహార్‌గా మారింది. కాందహార్‌.. ఆప్ఘన్‌ సామ్రాజ్యానికి తొలి రాజధాని. అంతేకాదు, ప్రస్తుత తాలిబన్ల వాస్తవ రాజధాని కూడా కాందహారే. నేడు పష్తూన్లుగా పిలవబడుతున్న ఆఫ్ఘన్లు.. మన వేద సాహిత్యంలో పేర్కొన్న ‘పక్త’ తెగ వారసులే.
సింధు ప్రాంతానికి చెందిన రాజా దాహిర్‌ సేన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించాడు. ఆప్ఘనిస్తాన్‌ను పాలించిన చివరి హిందూ పాలకుడు ఆయనే. ఆ తరువాత మహ్మద్‌ బిన్‌ ఖాసిం అనే దోపిడీదారుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. సాధారణ శకం 850 నుంచి 1026 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ షాషీల పాలనలోనే వుంది. వీరినే కాబూల్‌ షాహీలు అని కూడా పిలిచేవారు. వీరికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో సనాతన ధర్మం వెల్లివిరిసింది. ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ షాహీలు క్షత్రియులైనప్పటికీ.. వారి రాజ్యాన్ని స్థాపించినవాడు ‘కల్లార్‌’ అనే ఓ బ్రాహ్మణ మంత్రి.
ఇస్లాం రాకకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌ గిరిజన భూమి. ఈ ప్రాంతంలో నివసించిన పషాయి, నూరిస్తానీ తెగలు హిందుత్వాన్ని అనుసరించేవారు. 4, 5 శతాబ్దాల్లో కుషాణులు, కిదారా సామ్రాజ్యాల కింద ఆఫ్ఘనిస్తాన్‌, దాని పొరుగు ప్రాంతాల్లో హిందూమతం, బౌద్ధ మతం అభివృద్ధి చెందాయి. వారి పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లోనే కాకుండా.. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. నేటి ఆధునిక ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌ దేశాలు.. ఆఫ్ఘన్‌ రాజ్యంలో భాగంగా ఉండేవి.
కిదార సామ్రాజ్యం తరువాత, ఆఫ్ఘనిస్తాన్‌ 4, 6 శతాబ్దాల మధ్యకాలంలో.. మధ్య, దక్షిణాసియా ప్రాంతాన్ని హూణులు హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతం గుప్తుల పాలనలోకి వెళ్లింది. సాధారణ శకం 370లో కిదారులచే పాలించబడిన ఈ ప్రాంతాన్ని హూణులు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నేటి కాందహార్‌ ప్రాంతాన్ని గాంధార అని పిలిచేవారు. గాంధార ప్రాంతాన్ని ప్రసిద్ధిగాంచిన హుణుడు, ఖింగిలా అనే రాజు.. కిదార రాజులను ఓడిరచి స్వాధీనం చేసుకున్నాడు.
5వ శతాబ్దం చివర్లో.. హూణులు సింధ్‌ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. హుణులు ప్రధానంగా హిందూ, బౌద్ధ మతాలను పాటించేవారు. ఖింగిలా రాజు పాలనాకాలంలో శివుని ముద్రతో కూడిన నాణేలు చెలామణిలో వుండేవి. హూణులు ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారుగా సాధారణ శకం 666 నుండి 843 వరకు పరిపాలించారు.
ఇక, సాధారణ శకం 843 నుండి 850 వరకు, ఒక బ్రాహ్మణ మంత్రి ఈ ప్రాంతాన్ని పాలించారు. కల్కా వర్గానికి చెందిన బ్రాహ్మణుల ఆ కాలంలో ప్రాముఖ్యతను పొందింది. వారినే ఆ తరువాత కల్లర్లుగా పిలిచేవారు. కల్లర్లకు చెందిన ఓ బ్రాహ్మణ మంత్రి, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ షాహి రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత అనేక మంది హిందూ షాహి పాలకులు.. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ సంస్కృతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. వక్కదేవ, కమలవర్మన్‌, భీమదేవ, జయపాలదేవ, ఆనందపాల, త్రిలోచనపాల, భీంపాల వంటి రాజులు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతాన్ని 1026 వరకు పాలించారు.
కమలవర్మన్‌ పాలనలో సఫారిడ్‌ పాలన బలహీనపడిరది. దీంతో సిస్తాన్‌ ప్రాంతం సమనైద్‌ సామ్రాజ్యంలో భాగమైపోయింది. సఫారిడ్‌ రాజులు.. సిస్తాన్‌ నుంచి వచ్చిన సున్నీ పెర్షియన్‌ రాజవంశానికి చెందినవారు. ప్రస్తుత ఇరాన్‌ కేంద్రంగా వీరు పాలన సాగించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న జరాంజ్‌ వీళ్ల రాజధాని. 861 నుంచి 1003 వరకు వీరి పాలన సాగింది. ఆ తర్వాత హిందూషాహీలు ఈ ప్రాంతంపై పట్టు పెంచుకున్నారు.
షాహీలు తమ పశ్చిమ సరిహద్దుల్లో కార్యకలాపాలను వేగవంతం చేశారు. హిందూ షాహీల మద్దతుతో గజనీ హిందూ రాజుల పాదాక్రాంతమైంది. కమలవర్మన్‌ పాలనలో గజనీపై దాడి జరిగినప్పటికీ.. అతని వారసుడు భీమదేవుని కాలంలో ఈ ప్రాంతంలో హిందూ షాహీల పాలన మరింత బలోపేతమైంది.
శతాబ్ద కాలం పాటు.. పొరుగున వున్న బలమైన సమనైద్‌ సామ్రాజ్యంతో హిందూ షాహీలు విజయవంతంగా పోరు సాగించారు. అయితే, సమనైద్‌ ముస్లిం సామ్రాజ్యం క్రమంగా క్షీణతకు గురైనా.. టర్కీ అధికారులు మాత్రం సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. హిందూ కుష్‌కు దక్షిణాన ఉన్న హిందూ రాష్ట్రాలను భయపెడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే, వీరి అరచాకాలను ఎదుర్కోవడానికి భీమదేవుడికి మగసంతానం లేదు. దీంతో హిందూ షాహి రాజ్యం బలంగా, సంపన్నంగా వున్నప్పటికీ.. వారసుడు లేక పరిపాలన కష్టతరమైంది. ఈ నేపథ్యంలో మిత్రరాజ్యమైన పంజాబ్‌ రాజ్యానికి.. హిందూ షాహి రాజ్యాన్ని ధారదత్తం చేశాడు.
భీమదేవుని తర్వాత రాజా జయపాలదేవుడు రాజ్యపాలన చేశాడు. అయితే, తన పూర్వీకుల రాజవంశం నుంచి ‘దేవ’ అనే ఇంటిపేరుతో పాటు.. తన సొంత కుటుంబానికి చెందిన ‘పాల’ అనే పేరు చేర్చాడు. అప్పటి నుంచి హిందూ షాహీ రాజుల పేర్లలో ‘పాల’ అనే ఇంటి పేరు కొనసాగింది. జయపాలదేవుడు టర్క్‌ల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. దీంతో ఆయన పాలనలో హిందూ షాహీ రాజ్యం మరింత బలోపేతమైంది.
10వ శతాబ్దం వరకు హిందూ షాహీ పాలన అప్రతిహతంగా కొనసాగింది. కాలక్రమంలో అన్ని రాజ్యాల వలె హిందూ షాహీ రాజ్యం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ఇది గజనీ మహ్మద్‌కు సరైన అవకాశాన్ని అందించింది. క్షీణిస్తున్న హిందూ షాహీలపై పైచేయి సాధించిన ఈ పర్షియన్‌ రాజవంశం భారతదేశంలోకి ప్రవేశించింది. 1001 నవంబర్‌ 28న, మహమూద్‌ హంతక సైన్యం పెషావర్‌ యుద్ధంలో రాజా జయపాలదేవుడిని ఓడిరచింది.
దీంతో జయపాలుడు తనను తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడు ఆనందపాలుడు వచ్చినా హిందూ షాహీ రాజ్యం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ లో ఇస్లాం ప్రధాన మతంగా మారింది. 200 ఏళ్లపాటు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహీ రాజులు.. హిందూ సంస్కృతిని చెక్కుచెదరకుండా కాపాడారు.
ఎప్పుడైతే హిందూ షాహీ రాజవంశం క్షీణించిందో.. ఎప్పుడైతే ఇస్లాం రాజుల నియంత్రణలోకి వెళ్లిందో.. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ శాంతికి దూరమైంది. అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితిలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ చరిత్ర పురాతనమైనది. ఇస్లాం పుట్టకముందే ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ వెల్లివిరిసింది.
కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ షాహీల పాలనకు చరిత్ర పుటల్లో తగిన స్థానం దక్కలేదు. తాలిబన్ల ఆక్రమణతో అక్కడ మిగిలివున్న హైందవ సంస్కృతి, సంపద పూర్తిగా ధ్వంసమవుతోంది. ఒకప్పటి మన ధార్మిక క్షేత్రం మన కళ్ల ముందే కుంచించుకుపోతోంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ కష్టం ఎల్లకాలం వుండదు. అరాచకపాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే.
Source: NationalistHub
(vskandhra.org)

LEAVE A RESPONSE