Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డలను దూషించడం తప్పని చెప్పడమే సుబ్బారావు చేసిన తప్పా?

సుబ్బారావు గుప్తాపై వైసీపీ రౌడీలతో దాడి చేయించింది కాక, మతిస్థిమితం లేదని దుష్ప్రచారం చేస్తారా?
– మతిస్థిమితం లేనివ్యక్తిని మంత్రి బాలినేని, ముఖ్యమంత్రికి పరిచయం చేయడానికి ఎందుకు తీసుకెళ్లాడు?
• ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించినవారికి ఎవరికైనా సుబ్బారావు గుప్తాకు పట్టినగతే పడుతుందన్నది పాలకుల ఉద్దేశమా?
• సుబ్బారావు ఘటనతో పాటు, రాజంపేటలో లక్ష్మీకాంతప్రసాద్, విశాఖలో జగదీశ్వరుడి ఘటనలపై ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతారు?
• పోలీసుల కాపలాలేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు బయటకురావడంలేదంటే, ప్రజాగ్రహానికి భయపడికాదా?
• తమ పనులు, తమ వ్యాపారాలు చేసుకునే సౌమ్యులైన ఆర్యవైశ్యులపైన కాదు ప్రభుత్వం ప్రతాపంచూపాల్సింది.. భూకబ్జాలకు, ఇసుకదోపిడీకి పాల్పడేవారిపైన.
– మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు

వైసీపీప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరుప్రశ్నించినా వారికిఅవమానాలు, వేధింపులు, ఎదురుదెబ్బలు, పోలీసులతో చితకబాదించడాలు సర్వసాధారణం అయ్యాయని, డాక్టర్ సుధాకర్ ఉదంతం మొదలు, చిత్తూరుజిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ వరకు జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమని టీడీపీనేత, మాజీఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయు డు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు వైసీపీనేత సుబ్బారావు గుప్తాను చావచితకబాదడం, సదరుఘటన బయటకుపొక్కి ప్రభుత్వపరువుపోతోందని గ్రహించడంతో, సుబ్బారావు కి మతిస్థిమితంలేదని ప్రచారంచేస్తున్నారు. సుబ్బారావుగుప్తాకి మతిస్థిమితం లేదంటున్న మంత్రి బాలినేని, అదేవ్యక్తిని స్వయంగా తీసుకెళ్లిమరీ,ముఖ్యమంత్రికి ఎందుకు పరిచయం చేశాడని ప్రశ్నిస్తున్నాం. సుబ్బారావుగుప్తాతో పాటు, ఆర్యవైశ్యులు ఎవరైనా సరే, వారివ్యవ హారాలు, వ్యాపారాల్లో ఉంటారు. అలాంటివారిపై జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రులు దాడికి పాల్పడటాన్ని టీడీపీతరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం.

కడపజిల్లా రాజంపేటలో కుమ్మరి వర్గానికిచెందిన లక్ష్మీకాంత ప్రసాద్ అనే బీసీనేత తలకు రివాల్వర్ ఎక్కుపెట్టి, బెదిరించారు. అతనిఇంట్లోని అగ్రిమెంట్లను తస్కరించారు. దానిపై జిల్లాఎస్పీకి సదరువ్యక్తి

ఫిర్యాదుచేస్తే, ఆయన స్పందించలేదు. లక్ష్మీకాంతప్రసాద్ కోర్టులను ఆశ్రయించేవరకు పరిస్థితి వెళ్లింది. స్థానికఎమ్మెల్యే చెప్పారంటూ, రూ.100ల స్టాంప్ పేపర్లపై, తెల్లకాగితాలపై ప్రసాద్ నుంచి సంతకాలు తీసుకున్నారు. విశాఖలో జగదీశ్వరుడి అనేవ్యక్తి భూములను లాక్కోవడాన్ని చూస్తున్నాం. ఆరోగ్యసేతు యాప్ కనిపెట్టిన వెంకటేశ్వరరావుని బెదిరించి, ఆయన భూము లు లాక్కున్నారు. ఈ విధమైన భూకబ్జాలు, దోపిడీలకు వైసీపీపులివెందులబ్యాచ్ ను ప్రభుత్వంలోని పెద్దలు వాడుకుంటున్నారు.

తాగుబోతుల సంఖ్యను తగ్గించడానికే మద్యం ధరలుపెంచామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తగ్గించాల్సిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకుండా, మద్యం ధరలు తగ్గిస్తే ఎవరికి ప్రయోజనం? ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రశ్నిస్తే, పోలీసులతో వారిని వేధిస్తు న్నారు. పోలీసులసాయం లేకుండా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ఇప్పుడు రోడ్లపై తిర గలేని దుస్థితిలో ఉన్నారు. ఈప్రభుత్వం వద్ద రోడ్లువేయడానికి, రోడ్లపై గుంతలు పూయడాని కి, కనీసం ప్రాజెక్ట్ ల గేట్లకు బోల్టులు బిగించడానికి, గ్రీజు పూయడానికి కూడా డబ్బులు లేవు. ఇరిగేషన్ శాఖలోని వారికి ఈప్రభుత్వంలో పనేలేకుండా పోయింది.

ఆర్ అండ్ బీ శాఖ ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లుఎవరూ ముందుకురావడంలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్రచేస్తే, ప్రజలు తనగురించి, తనపాలనగురించి ఏమనుకుంటున్నారో వాస్తవాలు తెలుస్తాయి. ఆడబిడ్డలను దూషిచండం తప్పనిచెప్పిన సుబ్బారావుగుప్తాపై దాడి కి పాల్పడ్డారు. అతన్ని చావచితగ్గొట్టిందికాక, మతిభ్రమించిందనిచెప్పడం ఇంకా దారుణం.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారినిచంపేస్తారా? ఇదేమీదారుణమని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనపద్ధతి, పంథా మార్చుకోవాలని సూచిస్తున్నాం. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా పేట్రేగిపోతోంది, రాష్ట్రనాయకుడిగా వాటిని నిలువరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉంది. వాస్తవాలు మాట్లాడిన సుబ్బారావు గుప్తాకు మతిస్థి మితంలేదంటున్నారు. అలాంటి మతిస్థిమితంలేని బ్యాచ్ విశాఖనగరం, దానిచుట్టుపక్కలే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి గ్రహించాలి.

విశాఖలోని 80శాతం లాడ్జీల్లో పులివెందుల, కడప బృందాలే ఉన్నాయి. అవన్నీ ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డి అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాయి. ఆ ముఠాలను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు. సుబ్బారావుగుప్తాపై జరిగినదాడివంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాల్సింది ముఖ్యమంత్రే. ఒంగోలులో జరిగినఘటన మరోసారి జరిగితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరినీ ఏకతాటిపైకితీసుకొచ్చి, ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పేలా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE