Suryaa.co.in

Andhra Pradesh

బీసీ జనగణన జరగాలి.. అప్పుడే బీసీలకు న్యాయం

– ఇసుకలో వేల కోట్లు కొట్టేస్తున్న పందికొక్కు ఎవరు?
-420 కి ట్రేడ్ మార్క్ జగన్ రెడ్డి
-నేను జగన్ లా లక్ష కోట్లు దోచి జైలు కి వెళ్ళలేదు
-మొబైల్ లో ఒక్క బటన్ నొక్కితే మీ ఇంటికే బీసీ సర్టిఫికేట్ వచ్చే పద్దతి తీసుకొస్తాం.-
-తంబళ్లపల్లె నియోజకవర్గం మద్దయ్యప్పగారిపల్లి న్యూ మల్చరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

బీసీ కార్పొరేషన్ లోన్లు రావడం లేదు.కురుబ కులాన్ని జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మమ్మల్ని వేధిస్తున్నారు.రజక సామాజిక వర్గం వారికి వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. దోబి ఘాట్స్ వద్ద మౌలిక వసతులు లేవు. కరెంట్ బిల్లులు కట్టమని వేధిస్తున్నారు. బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేరుస్తా అని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారు.జగన్ పాలనలో విశ్వ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. ఇస్తానని చెప్పిన ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు.పాల ఎకరి కులం వారికి వైసిపి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందడం లేదు. మా మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.బీసీ విద్యార్థుల చదువుకి వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు.యాదవ కులస్థులకు వైసిపి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందడం లేదు.
మత్స్యకారులకి టిడిపి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, బోట్లు, వలలు అన్ని సబ్సిడీ తో ఇచ్చేవారు. జగన్ పాలనలో తెచ్చిన 217 జివో వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం. సబ్సిడీలు అందడం లేదు.

వారి సమస్యపై స్పందించిన లోకేష్‌ ఏమన్నారంటే…
ఎన్నికల ముందు జగన్ బీసీలకు కొండంత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకా చెవిలో పువ్వు పెట్టారు.ఒక్క ఛాన్స్ ఇస్తే సామాజిక న్యాయం అన్న జగన్ కుర్చీ రాగానే సామాజిక అన్యాయం చేశారు.నిధులు, అధికారం లేని పదవులు బీసీలకు ఇచ్చి ముఖ్యమైన పదవులు అన్ని జగన్ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. క్వారీలు కేటాయించింది టిడిపి. వడ్డెర్ల కు కేటాయించిన క్వారీలు పాపాల పెద్దిరెడ్డి కొట్టేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు క్వారీలు కేటాయిస్తాం.నియోజకవర్గం స్థాయిలో ఉప కులాల వారిగా భవనాలు నిర్మిస్తాం. ఆ తరువాత మండలాల వారీగా భవనాలు నిర్మాణం చేపడతాం. దామాషా ప్రకారం బీసీలకు నిధులు, రుణాలు కేటాయిస్తాం.కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది టిడిపి.గొర్రెలు పెంపకానికి రుణాలు ఇన్స్యూరెన్స్ కల్పించింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత గొర్రెలు మేపుకునే భూములు కబ్జా చేశారు. ఇన్స్యూరెన్స్ తొలగించారు. గొర్రెలు కొనుగోలుకు రుణాలు ఇవ్వడం లేదు.

రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని మండలికి పంపిన ఘనత టిడిపి ది.దోబి ఘాట్స్ నిర్మించాం, ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మెషీన్లు అందించాం.ఇప్పుడు వైసిపి ప్రభుత్వం రజకులను వేధిస్తుంది.తిరుమలతో సహా ఇతర దేవస్థానాల్లో బట్టలు ఉతికే కాంట్రాక్ట్ రజకులకు కేటాయిస్తాం. వైసిపి నేతలు రజక సోదరి మునిరాజమ్మ పై దాడి చేసి వేధించారు. ఆమెకు 5 లక్షలు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంది చంద్రబాబు . టిడిపి వలనే బీసీలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది. టిడిపి హయాంలో బిసిలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లు జగన్ 10 శాతం తగ్గించి బీసీలకు తీరని ద్రోహం చేశారు.16,500 మంది బీసీలు పదవులు కోల్పోయారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తగ్గించిన రిజర్వేషన్లు తిరిగి కల్పిస్తాం. బీసీ జనగణన జరగాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. దీని కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతుంది టిడిపి. బిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. కేంద్ర ప్రభుత్వం లో బిసిల నిధులు, నియామకాల కోసం ప్రత్యేక బీసీ శాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసింది టిడిపి.

బోయ, వాల్మికి లను ఎస్టీల్లో చేరుస్తా అని హామీ ఇచ్చి మోసం చేసింది జగన్.బోయ, వాల్మికి లను ఎస్టీల్లో చేర్చేందుకు టిడిపి వేసిన సత్యపాల్ కమిటీ రిపోర్ట్ ని జగన్ మూలన పడేసారు.విశ్వ బ్రాహ్మణులకు, రజకుల కు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని మోసం చేసింది జగన్.విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాం. పాలఏకరి కులం వారిని ఆదుకునే బాధ్యత నాది. అందుకే పార్టీ లో ఇప్పటికే బీసీ సాధికార సమితి ఏర్పాటు చేశారు.రాష్ట్రం మొత్తం పాలఏకరిలకు బీసీ సర్టిఫికేట్లు అందజేస్తాం.ప్రతి సారి ప్రభుత్వం చుట్టూ తిరిగి బీసీ సర్టిఫికేట్లు తీసుకునే దుస్థితి పోవాలి.బ్రిటీషు పరిపాలన లో భారతీయులం అని నిరూపించుకోవడానికి సర్టిఫికేట్లు ఇచ్చినట్టు ఇప్పటికీ బీసీ సర్టిఫికేట్లు కోసం బీసీలు అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ఒకే సారి బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోయేలా కొత్త ప్రణాళిక తీసుకొస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కితే మీ ఇంటికే బీసీ సర్టిఫికేట్ వచ్చే పద్దతి తీసుకొస్తాం. బీసీలు బీసీ సర్టిఫికేట్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తాం.వైసిపి నాయకులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసి బీసీల పై కేసులు పెడుతున్నారు.

బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. లీగల్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు బీసీ విద్యార్థులు బాగా చదువు కోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఏర్పాటు చేసిన అన్ని పథకాలు రద్దు చేసి తీరని ద్రోహం చేసింది. యాదవులను రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంది టిడిపి.టిడిపి హయాంలో యాదవులకు టిటిడి, తుడా, ఆర్ధిక శాఖ ఇలా అనేక పదవులు ఇచ్చింది టిడిపి. ఇప్పుడు ఆ పదవుల్లో ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. 420 కి ట్రేడ్ మార్క్ జగన్ రెడ్డి. నేను జగన్ లా లక్ష కోట్లు దోచి జైలు కి వెళ్ళలేదు.బాబాయ్ ని చంపేసి నాట్ టూ అరెస్ట్ అని కోర్టు కు వెళ్లారు జగన్ అండ్ కో. కేవలం ప్రజల తరపున పోరాడినందుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను రెడీ. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వెయ్యి రూపాయిలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు జగన్ పాలన లో ఐదు వేలు. ఇసుక ద్వారా జగన్ ఆదాయం రోజుకి మూడు కోట్లు.

ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయిలు ఉన్నప్పుడు టిడిపి నాయకులు ఇసుక లో కోట్లు దొబ్బేస్తున్నారు అన్న జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. ఇప్పుడు ఇసుకలో వేల కోట్లు కొట్టేస్తున్న పందికొక్కు ఎవరు? భారతి సిమెంట్ ధర విపరీతంగా పెంచేశారు. వైసిపి పాలనలో పనులు లేక 60 మంది భవన నిర్మాణ కార్మికులను చంపేశాడు జగన్.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల చంద్రన్న భీమా అమలు చేస్తాం.బీసీలు పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దుతాం.పేదరికం లేని రాష్ట్రం చూడాలి అనేది నా కోరిక. మత్స్యకారులని మోసం చేసింది జగన్. 217 జీఓ వలన ఎన్నో ఏళ్లుగా చెరువుల వద్ద చేపలు పడుతున్న మత్స్యకారుల హక్కులను హరించారు జగన్.బోట్లు ఇవ్వడం లేదు, వలలు సబ్సిడీ ద్వారా అందించడం లేదు. బీసీల పుట్టినిల్లు టిడిపి. అందుకే వైసిపి కండువా వేసుకోకపోయినా టిడిపి లో ఉన్న బీసీలను తీసుకెళ్ళి పదవులు ఇస్తున్నారు జగన్.జగన్ పరిపాలన లో రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లు దాటబోతుంది. కరెంట్ బిల్లులు కట్టలేదని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ కట్ చేసే పరిస్థితి.జగన్ పాలనలో రాష్ట్రం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటుంది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టి పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తాం.

LEAVE A RESPONSE