Suryaa.co.in

Andhra Pradesh

బీసీల ద్రోహి జగన్

* బీసీలంతా ఐక్యంగా ఉందాం
* మంత్రి సవిత పిలుపు
* టీడీపీతోనే వెనకబడిన వర్గాలకు గుర్తింపు
* బీసీల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం
* కర్నూల్ లో బీసీ శంఖారావం వనభోజన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత

కర్నూలు : అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న బీసీలు ఐక్యత సాధిద్దామాని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కర్నూల్ లో శనివారం నిర్వహించిన బీసీ శంఖారావం వనభోజన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరవాతే బీసీలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందన్నారు. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసిన అన్న ఎన్టీఆర్ దేనన్నారు.

తన తండ్రి రామచంద్రారెడ్డి సాధారణ పూల వ్యాపారి అని, ఆయనకు ఎమ్మెల్యేగా,ఎంపీగా పోటీ చేసే అవకాశమిచ్చారని అన్నారు. టీడీపీ ప్రోత్సాహంతో తన తండ్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేపట్టనన్ని శాఖాల మంత్రిగా పనిచేశారన్నారు. బీసీ నేతలైన కింజరాపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, తెలంగాణగాకు చెందిన దేవందర్ గౌడ్ వంటి ఎందరో ఉద్ధండు నేతలను రాష్ట్రానికి అందించిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనన్నారు.

ఆయన బాటలో పయనిస్తూ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు తన ప్రభుత్వాల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా బలోపేతమయ్యేలా బీసీలకు చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో తనతో సహా ఎనిమిది మంది బీసీ బిడ్డలకు మంత్రులుగా కీలక బాధ్యతలను చంద్రబాబు అప్పగించారన్నారన్నారు. అందుకే బీసీలంటే టీడీపీ…టీడీపీ అంటేనే బీసీలని అన్నారు.

బీసీల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం
గడిచిన 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సీఎం చంద్రబాబునాయుడు బీసీల అభ్యున్నతి కోసం ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్ లో రూ.39 వేల కోట్లు కేటాయించారన్నారు. స్వయం ఉపాధి కోసం 7 బీసీ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్లకు నిధులు మంజూరు చేశారన్నారు.

బీసీ హాస్టళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే బీసీ బిడ్డల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లను 26 జిల్లాల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేశామన్నారు. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలను చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లకు విధులతో నిధులు కూడా కేటాయించామన్నారు. ఇలా ప్రతి అడుగులోనూ బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి సవిత కొనియాడారు.

బీసీల ద్రోహి జగన్
గత 5 ఏళ్లలో ఉద్యోగాల కల్పన లేక, ఉపాధి లేక బీసీ బిడ్డలు ఎందరో తీవ్ర నిరాశ నిష్పృహల్లో కూరుకుపోయారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయం శాసనమండలి దృష్టికి తీసుకొస్తే…ఒక బీసీ మహిళ తమ తప్పులను ఎత్తిచూపడమా..? అని తనను మాట్లాడకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకులు చూశారన్నారు. బీసీ యువతకు చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకురావడం తప్పా..? అని ప్రశ్నించారు. బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు.

ఐక్యతతో ముందడుగు వేద్దాం
అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో నేడు ఎందరో బీసీ బిడ్డలు ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నరని మంత్రి సవిత తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉంటే మరింత అందలం ఎక్కడం ఖాయమని తెలిపారు. గడిచిన ఎన్నికల ముందు కర్నూలులో టీడీపీ అబ్జర్వర్ గా పనిచేసిన రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆనాడు తనకు అండగా నిలిచిన నాగేశ్వరరావుయాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. తననను ఏ సమయంలోనైనా ఎప్పుడైనా..ఎక్కడైనా కలవొచ్చని మంత్రి సవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ కర్నూలు ఎంపీ బస్తి నాగరాజు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు మాజీ జెడ్పిటిసి బత్తిని వెంకటరాముడు రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ తుగ్గలి నాగేంద్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు పలువురు టీడీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE