Suryaa.co.in

Andhra Pradesh

కర్నూలు బీసీ హాస్టళ్లు రెసిడెన్షియల్ అభివృద్ధికి రూ.కోటి కేటాయింపు

– ఎంపీ బత్తిపాటి నాగరాజును అభినందించిన మంత్రి సవిత
– కర్నూలులో వీవర్ శాల ఏర్పాటుకు కోటి ప్రకటించిన ఎంపీ నాగరాజు

కర్నూలు : కర్నూలు జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసిన ఎంపీ బత్తిపాటి నాగరాజుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో జరిగిన బీసీ శంఖారావం వనభోజన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి సవిత మ్మ శనివారం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు ను బీసీ పాఠశాల, హాస్టల్లో అభివృద్ధికై మంత్రి సవితమ్మ గారు ఎంపీ నిధులు కేటాయించాలని అడుగగా వెంటనే ఎంపీ నిధులనుండి, కర్నూలు జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి రూపాయలు అందజేస్తానని తెలియజేసిన ఎంపీ నాగరాజు గారు ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసినందుకు ఎంపీ బత్తిపాటి నాగరాజుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి వీవర్ శాల ఏర్పాటు నిమిత్తం ఎంపీ నాగరాజు కోటి రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపుడు కర్నూలు జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి మరో కోటి రూపాయలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు.

గడిచిన 5 ఏళ్లలో బీసీ హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరికి డైట్ బిల్లులు, కాస్మోటిక్స్ ఛార్జీలు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ బిడ్డలను జగన్ రెడ్డి రోడ్డున పడేశారన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, డైట్ బిల్లులు, కాస్మోటిక్స్ ఛార్జీల బకాయిలు మొత్తం చెల్లించారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బిల్లులు, కాస్మోటిక్స్ ఛార్జీలకు నిధులు కేటాయించారన్నారు.

కర్నూలు జిల్లాలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించిన ఎంపీ బత్తిపాటి నాగరాజుకు మరోసారి మంత్రి సవిత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బీసీ సంక్షేమ శాఖ అదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE