Suryaa.co.in

Andhra Pradesh

కరవు రహిత ధర్మవరాన్ని చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం

– ప్రతి నీటి బొట్టును వృథా కానివ్వకుండా రైతులకు అందిస్తున్నాం
– గతంలో బోటు షికార్ల కోసం ఆయకట్టు రైతులకు అన్యాయం చేశారు
– ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు
– ధర్మవరం చెరువు ఆయకట్టుకు నీరు విడుదల
– రావులచెరువు వద్ద గంగపూజ నిర్వహించిన పరిటాల శ్రీరామ్, సత్యకుమార్, మధుసూదన్ రెడ్డి

ధర్మవరం: కరవు రహిత ధర్మవరాన్ని చూడటమే మా ప్రభుత్వ లక్ష్యమని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. శనివారం హంద్రీనీవా నీటి ద్వారా నిండిన రావులచెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, జనసేన నేత మధుసూదన్ రెడ్డి, ఇతర కూటమి పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రావులచెరువు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సత్య కుమార్ తో పాటు పరిటాల శ్రీరామ్, మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ధర్మవరం చెరువు ఆయకట్టుకు నీరు కూడా విడుదల చేశారు. ఈ నీరు చిన్నూరు, చిన్నూరు బత్తలపల్లి,ధర్మపురి పంచాయతీ, తుమ్మల, తిప్పేపల్లి గ్రామ పరిధిలోని వందల ఎకరాలుకి అందనుంది. దీంతో రైతుల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా ధర్మవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో బోటు షికారుల కోసం, తమ విలాసాల కోసం ధర్మవరం చెరువు పూర్తిస్థాయిలో నిండినప్పటికీ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదని శ్రీరామ్ విమర్శలు చేశారు.

ఆ రోజే తాము స్పష్టంగా చెప్పామని అధికారంలోకి రాగానే.. ఆయకట్టుకు నీరు విడుదల చేసి చూపిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గానికి వచ్చిన ప్రతి నీటి బొట్టు lను సద్వినియోగం చేసుకొని రైతుల పొలాలు తడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రావులచెరువుకు హంద్రీనీవా నీరు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు కూడా నీరందించాలని చూశామని.. కానీ అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదన్నారు.

అయితే కచ్చితంగా రానున్న రోజుల్లో ధర్మవరంలోని ప్రతి చెరువును నింపడమే కాకుండా.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా, ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు

LEAVE A RESPONSE