Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు

– యనమల రామకృష్ణుడు

ధృఢ సంకల్పంతో అన్న ఎన్టీఆర్ గారు బీసీలకు సామాజిక న్యాయం చేశారు. టీడీపీ రాకముందు బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు ఉండేవి కావు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశం ఇచ్చారు.బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి వచ్చారంటే ఎన్టీఆరే కారణం.

వేదికపై ఉన్న వారికి బీసీల సమస్యల పట్ల అవగాహన ఉంది.ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీ వర్గాలకు చేయాల్సింది చాలా ఉంది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. డబ్బులేని బీసీలు ఏవిధంగా రాజకీయాల్లో రాణిస్తారో దానికి సరైన పరిష్కారం ఇద్దరు అధ్యక్షులు కనుగొనాలి.

జగన్ రెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. దీంతో సమాజంలో వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. దీనివల్ల బీసీలకు నష్టం ఎక్కువగా ఉంటుంది.ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు లేవు. బీసీలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. బీసీలకు అందించే సంక్షేమం తాత్కాలిక ఉపశమనమే. బీసీలను ఆర్థికపరంగా అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేయాలి.

రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే క్రమంలోనే బీసీలను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి. సహజ వనరులు ప్రజలకు చెందాలి.ఇంక్లూజివ్ ప్రాస్పెరిటీ గురించి మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. బీసీల డిక్లరేషన్ కార్యరూపం దాల్చి, అభివృద్ధిలో భాగస్వామ్యులుగా చేయాలి, మా అందరి సహకారం మీకు ఉంటుంది.

LEAVE A RESPONSE