రేవంత్ రెడ్డికి ఏపీఆర్వోగా పూండ్రు అన్వేష్ రెడ్డి

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పూండ్రు అన్వేష్ రెడ్డి (తండ్రి మోహన్ రెడ్డి బేల మండల్‌ ఖొద్దూర్‌లో స్కూల్ అసిస్టెంట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు ప్రజాసంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ మరియు హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అన్వేష్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామం కాగా 30 ఏళ్ల నుంచి పట్టణంలో స్థిరపడ్డారు.

Leave a Reply