– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు
TSPSC అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేస్తారా?కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి.ఈ ప్రభుత్వం నిరసనల పట్ల అసహనంగా ఉంది. బండి సంజయ్ దీక్షను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత్రనక, పగలనక ఎంతో కష్టపడి ప్రిపేరైన అభ్యర్థులుకు మద్దతుగా నిలవడమే ఆయన చేసిన నేరమా…? వెంటనే బండి సంజయ్ కుమార్ ని విడుదల చేయాలి… లేకుంటే మా బిజెపి సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చూపిస్తాం.
కేటీఆర్ ను ముందుగా అరెస్టు చేయాలి: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏ.పి. జితేందర్ రెడ్డి
TSPSC అవకతవకలపై బిజెపి పోరాటాలకు ప్రజల నుంచి మద్దతు వస్తుందన్న దుగ్దతోనే కేసీఆర్ సర్కార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయించింది.. బండి సంజయ్ కుమార్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడే.. దమ్ముంటే పేపర్ లీకులకు బాధ్యులైన మంత్రి కేటీఆర్ ను ముందుగా అరెస్టు చేయాలి.. ఈ స్కాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సబంధం లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది..?