– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి
లిక్కర్ స్కాంలో బిడ్డను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు.TSPSC జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ శాంతియుతంగా గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అరెస్టును చేయడం కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనం ప్రశ్నా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన కేటీఆర్ ఇలా పోలీసులను పంపించి అక్రమ అరెస్టులు చేయించడం దుర్మార్గం.
యువతను మోసం చేయడం కేసీఆర్ కు అలవాటే: – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామి
ఎన్నికల సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ యువతను మోసం చేయడం కేసీఆర్ కు అలవాటే.పేపర్ లీకేజ్ పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మరోసారి యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.పదవ తరగతి పరీక్షా పత్రం నుండి మొదలుకుని రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఎంసెట్, TSPSC పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం సిగ్గుచేటు.ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తూ ప్రజా పోరాటం చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణి కి నిదర్శనం తక్షణమే బండి సంజయ్ కుమార్ ని విడుదల చేయాలి… లేకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం