నువ్వంటే..
అందం అనుకున్నా..
అది నా హృదయ సౌందర్యమే..
అని తెలుసుకోలేకపోయా!
నువ్వుంటే..
ఆనందం అనుకున్నా..
అది నా ఆత్మానందమే..
అని తెలుసుకోలేకపోయా!
నీతోటే..
అనుబంధం అనుకున్నా..
అది నా ఋణానుబంధమే..
అని తెలుసుకోలేకపోయా!
ఋణానుబంధ రూపేణా
పశు,పత్ని,సుతాలయాత్!
ఇవన్నీ తీరిపోయే..
ఋణానుబంధాలే!
కాబట్టి..
వ్యామోహం పెంచుకోకుండా..
తిరిగి ఆశించకుండా..
నిష్కల్మషమైన..
మన ప్రేమను మాత్రమే పంచుదాం!
తామరాకు మీద నీటిబొట్టు లాగా!
ఆత్మ లేని శరీరానికి అసలు విలువే లేదు!