Suryaa.co.in

Features

బీదోడి పండుగ

అమ్మ కంఠం ఒక్కసారి ఒక్కొక్క రకంగా టపాసుల్లా పేలుతూ దగ్గు చప్పుడు…

నాన్న ఒంట ఒక్కసారి ఒక్కొక్క రకంగా కాలుతూ జ్వరం సెగలు…

గుడిసె గుమ్మమంతా సమస్యలతో నిండిన కాలుష్య కన్నీటి కథలు…

భూచక్రంలా తిరుగుతున్న బీదరికంలో…
కాకరపువ్వులా కాలుతున్న కడుపు ఆకలి మంటలో…
చిచ్చు బుడ్డిలా చిచ్చురేపుతున్న ఆవేదనలో
మతాబుల్లా మాడుతున్న కలల్లో వెలుగులు లేని అమావాస్యలా మిగిలినది దీపావళి.

కడుపు నిండడమే దీపావళి…
సమస్య తీరడమే సంక్రాంతి…
డబ్బు మిగలడమే దసరా…
ఉనికి ఉండడమే ఉగాది…
పూట గడవడమే పండుగ….
పూట గడవనప్పుడు ఎన్ని పండుగలు వచ్చిన దండగా…

ఇదేగా స్వతంత్ర దేశంలో బీదోడి నిత్య పండుగ…

– అభిరామ్
9704153642

LEAVE A RESPONSE