సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని విచారణకు హాజరుకమ్మని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్) నోటీసులు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ అని కొందరు మిత్రులు అడుగుతున్నారు.ఇదిగో చదవండి.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ కంపెనీకి 2000 కోట్లు వరకు ఆస్తులు ఉన్నాయి.1937లలో నెహ్రూ గారు మరో 5000 మంది స్వాతంత్ర సమరయోధులు
వాటాదారులుగా కలసి, స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడుతుందని నేషనల్ హెరాల్డ్ పేపర్ కోసం ఈ AJL కంపెనీ ప్రారంభించారు.దేశానికి స్వతంత్రం వచ్చాక ఈ AJL కంపెనీ ఒక్క పేపర్స్ మాత్రమే పబ్లిష్ చెయ్యాలి, ఇంకే వ్యాపారం చెయ్యకూడదు వంటి పలు నిబంధనలతో భవనాలు నిర్మించుకుంది. ప్రభుత్వం చాలా పెద్ద నగరాల్లో విలువైన స్థలాలు చవగ్గా ఇచ్చింది.
ఈ కంపెనీకి 90 లక్షల 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంటే ఇది నెహ్రు కుటుంబం సొంత ఆస్తి కాదు. 5000 మంది వాటాదారుల ఆస్తి. 2010కి పలు కారణాల వల్ల అంటే మరణాలు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో వాటాదారుల సంఖ్య వెయ్యికి తగ్గిపోయింది.
2008లో ఈ పేపర్ మూతపడినందువల్ల, సుమారు 90 కోట్లు పైచిలుకు అప్పులు పేరుకు పోయాయి.సాధారణంగా కంపెనీ దివాళా తీస్తే కంపెనీది ఏదో ఒక ఆస్తి అమ్మి, ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటా దారులందరికి పంచుతారు.
కానీ NH విషయంలో అలా జరగలేదు…నేషనల్ హెరాల్డ్ పేపర్ ని మళ్ళీ ప్రారంభిస్తాము అని చెప్పి, దానికి ఉన్న ₹90 కోట్లు అప్పు తీర్చేసుకుందికి అని, కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఫండ్స్ నుండి నేషనల్ హెరాల్డ్ (AJL) కంపెనీకి వడ్డీ లేకుండా 90 కోట్లు అప్పు ఇచ్చింది . ఇన్కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం రాజకీయ పార్టీ నిధులు ఇటువంటి వాటికి వెచ్చించకూడదు.
ఇది ఇలా ఉండగా…2010 లో యంగ్ ఇండియన్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీ, 5 లక్షల మూలధనంతో 38% సోనియా, 38% రాహుల్, మిగతా 24% ఆస్కార్ ఫెర్నాండేజ్, మోతిలాల్ ఒరా (కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్) వాటాదారులుగా ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్ లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని ఎక్కడా రాయలేదు.
ఇప్పుడు చూడండి అసలు కథ..
కాంగ్రెస్ పార్టీ తనకి నేషనల్ హెరాల్డ్ నుండి రావలసిన 90 కోట్ల అప్పుని, ఈ కొత్త యంగ్ ఇండియా కంపెనీకి అసైన్ అంటే బదిలీ చేసేసింది. అంటే నేషనల్ హెరాల్డ్ కంపెనీ ఇప్పుడు, యంగ్ ఇండియా కంపెనీకి ఈ 90 కోట్లు అప్పు చెల్లించాలి. కానీ నేషనల్ హెరాల్డ్ అప్పు తీర్చే స్థితిలో లేదు కాబట్టి, అప్పు బదులు.. తన 90 లక్షల షేర్స్ ని ఒక బోర్డ్ మీటింగ్ పెట్టి, మిగతా షేర్ హోల్డర్లు కి చెప్పకుండా..యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తండ్రికి కూడా వాటాలు ఉన్నాయి. అయినా ఇలా కంపెనీ వాటాలు యంగ్ ఇండియాకు బదిలీ చేస్తున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదు అని భూషణ్ ఆరోపించారు.
అంటే కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు యంగ్ ఇండియా 90 కోట్లు బాకీ ఉంది. యంగ్ ఇండియా కి ఉన్న కాపిటల్ 5 లక్షలు మాత్రమే. 90 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది? అందుకని కాంగ్రెస్ పోనీ అని పాపం 50 లక్షలు అప్పు తీర్చండి. మిగతాది రైట్ ఆఫ్ చేసుంటాం అని చెప్పింది. పోనీ ఆ 50 లక్షలు యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే లేవు. అందుకని కలకత్తా లో ఒక డమ్మీ కంపెనీ (హవాలా కంపెనీ) ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది..ఈ కలకత్తా కంపెనీలు ఇలాగే చాలామందికి వారి దగ్గరే హార్డ్ క్యాష్ తీసుకొని, మళ్లీ వాళ్లకే అప్పు ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి.. 1% నుండి 2% కమిషన్ తీసుకుంటాయి.
అంటే యంగ్ ఇండియా కాంగ్రెస్ కి ఇవ్వవలసిన 90 కోట్లు అప్పు పూర్తిగా తీరిపోయింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సుమారు ₹2000 కోట్లు విలువైనవి. సోనియా, రాహుల్ షేర్ హోల్డర్స్ గా ఉన్న యంగ్ ఇండియా కంపెనీకి వచ్చాయి.
సో ఇప్పుడు మొత్తంగా జరిగింది సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 50 లక్షలు (ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు) ఇచ్చి నేషనల్ హెరాల్డ్ కంపెనీవి ₹2000 కోట్ల ఆస్తులుపై యంగ్ ఇండియా కంపనీ ద్వారా సోనియా రాహుల్ హక్కులు సంపాదించారన్న మాట.
కొసమెరుపు ఏమిటంటే.. అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలలో ఎక్కడా నేషనల్ హెరాల్డ్ కి ₹90 కోట్లు అప్పు ఇచ్చినట్లు చూపించలేదు అని సుబ్రమణ్య స్వామి ఆరోపణ. ఇంకా నేషనల్ హెరాల్డ్ కి ఢిల్లీ లో ఉన్న ఒక్క బిల్డింగ్ లో ఒక్క అంతస్తు మీదే నెలకు 80 లక్షల దాకా అద్దెలు వస్తున్నాయి. చాలా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ వంటివి ఈ బిల్డింగ్ లో అద్దెకు ఉన్నాయి.
ఇంత అద్దెలు వస్తున్నప్పుడు మరి నేషనల్ హెరాల్డ్ వద్ద అప్పు తీర్చడానికి డబ్బులు లేకపోవడం ఏమిటి?
దీనిపై సుబ్రమణ్య స్వామి కోర్టులో కేసు వేస్తే, అరెస్ట్ నుండి కునేందుకు 2015లో సోనియా రాహుల్ బెయిల్ సంపాదించారు. ప్రస్తుతం ఇద్దరూ 2015 నుండి బెయిల్ మీదే వున్నారు.
ఈ విచారణ ఆపాలని సోనియా రాహుల్ సుప్రీంకోర్టుకి వెళ్తే.. విచారణ మీద స్టే ఇవ్వలేం, విచారణకు సహకరించండి, మీరు సంఘంలో పెద్ద మనుషులు కాబట్టి స్వయంగా విచారణ హాజరుకు మినహాయింపు
ఇస్తున్నాం అని చెప్పింది.ఇంకో విచిత్రం.. నేషనల్ హెరాల్డ్ కంపనీ (AJL) హెడ్ ఆఫీస్, యంగ్ ఇండియా హెడ్ ఆఫీస్ రెండూ నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ లోనే ఉన్నాయి.
అసలు మౌలిక ప్రశ్నలు
1. నెలకు 80 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నప్పుడు, ₹90 కోట్లు బాకీ నేషనల్ హెరాల్డ్ కంపెనీ నే తీర్చుకోవచ్చు కదా? పేపర్ నడపడం ఆపేసాక ఇన్నాళ్లూ వస్తున్న ఈ అద్దె డబ్బులు ఏం అయిపోయాయి?
2. కాంగ్రెస్ కి నిజంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ ప్రారంభించాలి అంటే, ఆ 90 కోట్లు అప్పు ఇచ్చి తరువాత వసూలు చేసుకోవచ్చు. లేదా నెహ్రు స్థాపించిన పేపర్ అని చెప్పి ఆ 90 కోట్లు మాఫీ చేసి ఉండవచ్చు.
3. అసలు ₹90కోట్లు కాంగ్రెస్ బుక్స్ లో లేనప్పుడు, నేషనల్ హెరాల్డ్ కి 90 కోట్లు అసలు ఇచ్చారా? ఇస్తే ఎవరు ఇచ్చారు?
4. అసలు నేషనల్ హెరాల్డ్ కి నిజంగా 90 కోట్లు అప్పు ఉందా?
4. అసలు యాంగ్ ఇండియా కంపెనీ ప్రారంభించడానికి కారణం ఏమిటి?
అంతా మాయ…
చూడబోతే ఒక ₹50 లక్షలు తో, వెనక దారిలో 2000 కోట్లు ఆస్తులు కొట్టేయ్యలి అనే ప్రణాళిక కనిపిస్తోంది.
ఈడీ అధికారుల వాదనల బట్టి, అసలు నేషనల్ హెరాల్డ్ కి ₹90కోట్ల అప్పు లేదు అని అంటున్నారు. ఈ మాయ ఛేదించడానికే ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ క్రింద సోనియాకు, రాహుల్ కి నోటీసులు ఇచ్చింది.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం , EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)