కమ్యూనిస్టుల నోరు మూయించిన ఫెర్నాండెజ్‌

– సీపీఎం మేనిఫెస్టో ఆధారంగా కాంగ్రెస్‌ను ఆడేసుకున్న జార్జి ఫెర్నాండెజ్‌

అది 1998వ సంవత్సరం. ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం, CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు.
సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు… “స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను” అంటూ ఒక పుస్తకాన్ని తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు….

“కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది). బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది”

ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి “స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము” అంటూ గోల చేశారు.
జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ “దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను” అంటూ, మళ్ళీ చదవ సాగాడు.

“సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం”. ఇక తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు.

అప్పుడు పెర్నాండెజ్ గారు “సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను…
ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో”. అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, “ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం.? మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు? సిగ్గు పోయిందా మీకు? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది” అంటూ ముగించారు.ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం.

– జయకుమార్‌సింగ్‌

Leave a Reply