Suryaa.co.in

Political News

తస్మాత్ జాగ్రత్త!

రాజధాని భూములు అమ్మకానికి పెట్టారు!
ఎకరం పదికోట్లు అంట !
ఆరు నెలల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అప్పగించండి..!
గౌరవ ఉన్నత న్యాయస్ధానం!
అబ్బే అరవై నెలలైనా పడుతుంది..!
ప్రభుత్వం..!
అమరావతి ..భ్రమరావతి అన్నాడొకరు !
అయ్యా ఒకసారి ఇటు చూడు..!
ఎకరం పదికోట్లంట!
ముక్కు లేక పోతే మీరు బాగోరు!
అందుకే ముక్కు నేలకు రాయద్దు కాని బహిరంగ క్షమాపణ చెప్పు!
రైతుల త్యాగాన్ని వెకిలిగా ఎగతాళి చేసిన వక్రాచార్యుడు ..ఉండవల్లి గారూ..!
ఇప్పుడేమంటారు..!
నీ వెక్కిరింపు కి సమాధానం దొరికిందనుకుంటున్నాను!
ఇంకొకాయన ..మలబద్దకం తో సతమతమవుతూ కూడా పుస్తకం వ్రాసేసాడు.
అమరావతి ఎవరి కోసం అంట!
పంచె కట్టుకుని మరీ వచ్చాడు శంకుస్ధాపనకు..!
మేడిపండు..!
ఎర్రగా బుర్రగా ఉన్నా పొట్టనిండా విషప్పురుగులే!
అదే వేదిక మీద వెర్రి నవ్వులు నవ్వినాళ్ళు ..ఇక పిచ్చి నవ్వులు నవ్వుకోండి!
amaravath-buildగ్రాఫిక్స్ అన్న గాడిదలు..బిగ్గరగా ఓండ్ర పెట్టండి!
శ్మశానం అన్నాడొకరు..!
ఎడారి అన్నాడింకొకరు..!
మునిగిపోయేదంటాడు ఇంకొకడు!
భవంతులు పాడుపెట్టారు..!
పిచ్చి మొక్కలు మొలిపించారు..!
ముంచటానికి చూసారు..!
నిర్మాణ సామగ్రి దొంగిలించారు!
రోడ్లు తవ్వుకుని పోయారు!
రాజధాని అమరావతి ని చెరపట్టి చిత్రవధ చేసారు!
ఇవాళ ..పాలన చేతకాక..దివాళ తీసి..!
అప్పులపాలయ్యి!
అప్పులు పుట్టక రైతులిచ్చిన భూములే దిక్కయ్యాయి!
దళిత బహుజన రైతు మహిళల్ని ఎంతగా హింసించారో కదా!
ఆందోళన కు గురి చేసారు!
వారి మృతి కి కారణమయ్యారు!
నిరసన తెలిపితే దాడి చేసారు!
నిర్భంధించారు!
రక్తగాయాలు చేసారు!
హేళన చేసారు!
దూషించారు!
అవమానించారు!

ఇప్పుడు సిగ్గు శరం వదిలేసి భూములు అమ్ముకోవటానికి తెగబడ్డారు!
సమయానికి కౌలు డబ్బులు అందకపోయినా..!
మూడు సంవత్సరాలుగా బతుకు చిత్రాన్ని మార్చి ఆవేదన కు ఆందోళనకు గురిచేసినా..!
సహనం ..సంయమనంతో వ్యవహరించారు!
దాడులు దౌర్జన్యాలు.. భరించారు..సహించారు..!
ఇంత చేసి భూములు అమ్ముకు దొబ్బుదామనుకుంటే..!amaravathi-babuనిన్న గాక మొన్నే కొత్త కారం దంచి డబ్బాల్లో నింపి పెట్టుకున్నారు!
వాటిని కూరలకు వాడుకుందామనుకుంటున్నారు..!
వారి మనసు మార్చుకునే లా చెయ్యొద్దు!
వారి దెంత సహనమో..అంత కదనకుతూహలం !
ఈసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవడం మీ వంతు..!
ఎద్దుల్లాంటి మీ భటుల్ని నడుం ఇరగ్గొడతారు!
ఏ కీలు కా కీలు విరిచేస్తారు!
ఏ గోరు కా గోరు వలిచేస్తారు!
వారి ఆగ్రహం కట్టలు తెగనివ్వవద్దు!
తస్మాత్ జాగ్రత్త!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE