ముస్లిం మైనారిటీలను ఊచకోత కోసింది. కోస్తోంది. దాన్ని ఖండించని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది.
దళితులపై దాడులూ హత్యాకాండనూ ముమ్మరం చేసింది. కొనసాగిస్తోంది. దానిపై నోరు మెదపని దళితుడు రామనాథ కోవింద్ ను రాష్ట్రపతిని చేసింది.
ప్రస్తుతం దేశమంతటా అటవీ భూముల్లో మైనింగ్, ఇతర కారణాలతో అడవి బిడ్డలను తమ జీవన భద్రతకు బీజేపి దూరం చేస్తోంది. వారికి అండగా నిలిచిన స్టాన్ స్వామిని వృద్ధాప్యంలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా అరెస్టు చేసింది జైల్లో పెట్టింది. ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించింది. జైల్లోనే చనిపోయేలా చేసింది. ఈ దుర్మార్గాల పట్ల ఏమాత్రం స్పందించని బీజేపీ ప్రభుత్వం, గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసి ఇప్పుడు గిరిజనులను ఉద్దరిస్తానంటున్నది. నమ్ముదామా?
సాధారణ దళిత, గిరిజన, మైనారిటీలలో కొద్దిమందికి పదవులు ఇస్తారు.అది ఆయా తరగతుల ఉద్దరణగా డబ్బా వాయిస్తారు. ఆయా సెక్షన్లలోని సాధారణ ప్రజానీకాన్ని కౄరంగా అణగదొక్కుతారు. వాహ్వా. ఎంత గొప్ప రాజకీయ చాతుర్యమో కదా?
గిరిజన అభ్యర్థి పేరుతో వైసిపి బలపర్చడం వెనుక.. రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టిన బిజెపిని బలపర్చడానికి వెతుక్కున్న సాకు మాత్రమే. టిడిపి ఏం చెబుతుందో అదీ చూద్దాం.
వై.నేతాజీ గారి వాల్ నుంచి (స్వల్ప మార్పులతో) గుంటూరు.
కాపు శ్రీనివాస్