Suryaa.co.in

Features

సరికొత్త యక్ష ప్రశ్నలు

ఏటీఎం కి వెళ్ళి డబ్బులు తీసుకు రమ్మన్న సోదరులు ఎంత సేపటికి రాకపోయేసరికి ఆదుర్దా తో ధర్మరాజు స్వయంగా తానే బయలుదేరాడు.
తమ్ముల జాడ తీస్తూ బయలుదేరిన ధర్మరాజుకి ”బాంక్ ఆఫ్ యక్ష”వద్ద విగత జీవులై పడిఉన్న సోదరులను చూసి నివ్వెరపోయాడు.
”ఓ ధర్మరాజా! నగదు లేదు అని చెబుతున్నా వినకుండా.. నన్ను మా కుబేరుడిని నానా దుర్బాషలాడిన ఫలం. నేనడిగే ప్రశ్న లకు సమాధానాలు చెప్పి సోదరులను బతికించుకో “అన్నాడు యక్షుడు.

ధన్యోస్మి యక్షరాజా నేను సిద్దం అనగానే యక్షుడు ప్రశ్నలు ఆరంభించాడు యక్షుడు…
1 ప్రశ్న:ఆరంభమే కానీ అంతమెప్పుడో తెలియనిది ఏది?
సమాధానం:తెలుగు టీవీ సీరియల్.
2 ప్రశ్న:భారతదేశంలో నేతిబీరకాయలో నెయ్యి వంటిది ఏది?
సమాధానం:సెక్యూలరిజం
3 ప్రశ్న: భారతదేశంలో నాడూ నేడూ అమలవుతున్న ఒకే ఒక పద్దతి ఏది?
సమాధానం: ప్రతిభకు సమాధి కట్టడం.
4 ప్రశ్న: ప్రభుత్వాల పోషకుడెవరు?
సమాధానం:తాగుబోతు.
చివరగా
5 ప్రశ్న: ప్రపంచ శాంతి నెలకొనేది ఎప్పుడు?
సమాధానం: యక్షరాజా దీనికి రెండు సమాధానాలు.
A. ఆంధ్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చినప్పుడు.
B. హైద్రాబాదులో రోడ్లు తవ్వటం పూర్తిగా ఆపి డ్రెన్లు మరమ్మత్తు చేసినపుడు.
శభాష్ ధర్మరాజా అని యక్షుడనగానే సోదరులంతా బతికొచ్చారు.

ఇంకా నించునే ఉన్న ధర్మరాజును చూసి యక్షుడు, ఇంకేమి వలయు ధర్మనందనా అనగా, “క్యాష్ కావలె” అన్నారు పాండవులు ముక్త కంఠంతో హు…ఆ ఒక్కటీ అడక్కండి అని యక్షుడు అంతర్దాన మయ్యాడు.

– రాజు

LEAVE A RESPONSE