Suryaa.co.in

Andhra Pradesh Political News

భారతమ్మ.. మీ ఆయనకు మీరైనా జర చెప్పండి!

వైయస్ భారతీ రెడ్డి గారికి,

మీరు అప్పుడప్పుడు వెళ్లే మీ పులివెందులలో.. ‘లావాడే’ అనే ఇంటిపేరు గల ఈ కుటుంబం ఉంది. అందులో శారద అనే ఒక తల్లి ఉంది. ఆవిడకి 5 మంది పిల్లలు.

సోదరీ, మీరు 2014లో పులివెందులలో ఇంటింటికీ తిరుగుతూ, “మీ పిల్లల్ని బడికి పంపితే మా ఆయన సీఎం అయ్యి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాడు, ఇద్దర్ని పంపిస్తే ₹30,000/- వేస్తాడు” అని అక్కడి వారిని ఒప్పించారు.

అందరి బుగ్గలు నిమిరి, తలల మీద జుట్టు సవరించే మీ ఆయన, ఒకరికిపైగా పిల్లలు ఉన్న తల్లులను నిలువునా ముంచాడు.

మీ ఆయన మళ్లీ 2024 ఎన్నికలకు ముందు “నేను బటన్ నొక్కే నవరత్నాలు తప్ప, మిగిలినవి ఎవరూ ఇవ్వలేరు. నాకు చేతగాని, చెయ్యలేనివి చెప్పి నేను జనాన్ని ఏమార్చలేను” అని చెబుతూ, తాను 2019లో చెప్పి ప్రజలను ఏమార్చింది కూడా తెలివిగా వారిని మరిచిపోయేలా చేశానని అనుకున్నాడు.

బడుల డబ్బుల నుండి 45 ఏళ్లకే పెన్షన్ వరకు, దానికి పైన బోనస్ టార్చర్, గబ్బు లిక్కర్… ఇవేవీ జనం మరిచిపోలేదు. వై అట్లీస్ట్ అపోజిషన్ అని అట్ల కాడతో రెండు సార్లు తలమీద బాధితే లేచిన బుడిపెలా అన్నట్లు వకటి వకటి మిగిలాయి.

మీరు, మీ ఆయన ఇస్తానని చెప్పినట్లే… నాయుడు ఇస్తానని చెప్పి, గెలిచి, తన మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి బిడ్డకూ డబ్బులు వారి తల్లుల అకౌంట్లో వేశాడు.

అలా మీ పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలం, బక్కన్న గారి పల్లి గ్రామంలో “తల్లికి వందనం” పథకం కింద ఐదు మంది పిల్లలు ఉన్న ‘లావాడే’ కుటుంబంలో ఉన్న తల్లి శారద ఖాతాలో ₹65,000/- జమ అయ్యాయి.

తల్లి పేరు: లావడే శారద
పిల్లల పేర్లు:
* లావడే మనీషా
* లావడే అవంతిక
* లావడే అనుష్క
* లావడే అఖిల్
* లావడే దినేశ్వరి

11 మంది ఎమ్మెల్యేలలో మీ ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. పులివెందులలో మెజారిటీ తగ్గినా 2024లో అక్కడ గెలిచాడు. ఇప్పటికే కడపలో మహానాడు జరిపి టిడిపి వాళ్లు జోరుగా ఉన్నారు.

2029 లో మీ ఆయన బయట ఉంటే ఆయన కోసం, ఆయన లోనికి వెళ్లి మీరు బయట ఉంటే మీ కోసం, ఇప్పటి నుండే పులివెందులలో తిరగండి. యాలహంకా, తాడేపల్లి మధ్యన తిరిగితే ఆ 10 వస్తుందో రాదో చెప్పలేను గానీ… పులివెందులను నిలబెట్టుకోవడం మొదటి ప్రాధాన్యతగా చూసుకోండి. అసలే మీ సంధింటి ఆడపడుచులు ఈ సారి ఇంకా గట్టిగా వస్తారు.

మీ ఇంట్లో పిల్లలు ఇద్దరూ లండన్ లాంటి విదేశాల్లో చదువుకోవాల, మేము మాత్రం ఒక బిడ్డనే చదివించుకోవాలా అని మీరు పులివెందులలో కనిపిస్తే అడిగినా జనం అడుగుతారేమో. ఇన్ని టెన్షన్లలో ఇంకా “లోకేశ్ 2 వేలు జేబులో వేసుకున్నాడు” లాంటి మన చిల్లర మాటలు ఎవరూ నమ్మరు. అది మరింత చర్చకు దారితీస్తుంది. చిల్లర సజ్జలను నమ్మి చౌకబారు విమర్శలు చేస్తే మిమ్మల్ని నమ్మరు అని తెలుసుకోండి.

ఇదంతా మీతో ఎందుకంటే, మీరు చెబితేనే మీ ఆయన వింటున్నాడని మీ ఆడపడుచులే అంటున్నారు కాబట్టి, మీ అభిమానుల తరపున చెప్పాను. ఇక మీ ఇష్టం.

(బాబు భూమా)

LEAVE A RESPONSE