Suryaa.co.in

Andhra Pradesh

తండ్రి-కొడుకు..ముగ్గురు రాజులు!

తండ్రి..కొడుకు..!
వైయస్..జగన్ రెడ్డి..!
ముగ్గురు రాజులు..!
అబ్బా..కొడుకులు ఇద్దరూ ఓడించారు..చంద్రబాబు ని అంటారు..!
అంతకు ముందే చంద్రబాబు చేతిలో పరాభవం జరిగింది ఇద్దరికి..!
పరాజయం పాలయ్యారు..!
ఇప్పుడు ఏకంగా ఘోరపరాజయం..!
ఇది గుర్తుండదు..చక్కెరకేళీ బేచ్ కి..!

కానీ తండ్రీ కొడుకులిద్దరూ !
సంప్రదాయంగా..రాజుల కుటుంబాలను వీధిలోకి తీసుకువచ్చారు!
ఇదీ గుర్తుండదు..తుంపర సేద్యం బేచ్ కి!

పాపం సత్యంరాజు గార్ని ఆర్ధికంగా..సామాజికంగా..మానసికంగా..భౌతికంగా దాడి చేసి..హింసించారు.
చేయని తప్పుకు తలవంచుకుని శిక్ష అనుభవిస్తున్నారు…అవమాన భారంతో కృంగిపోయారు!
రాజకీయ కవచం వాడుకోవటం ఆయనకు తెలియలేదు!

సత్యం రాజు గారి ఆలోచన..ఆచరణ ..!దొబ్బేసి..సిగ్గులేకుండా..కుయ్ కుయ్ మని మందిలో కూసి లబ్ధి పొందారు.
ఒక్క కుహనా మేధావి కుక్క కూడా సత్యంరాజుగారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదు.
ఆ బాబూ కొడుకులు చేసిన ద్రోహం గురించి చెప్పరు.

రెబల్ స్టార్ !
రఘురామకృష్ణరాజు గారి దగ్గర పప్పులు ఉడకలేదు.
సత్యంరాజుగారిలా..మౌనంగా ఇంట్లో పడి ఉంటారనుకున్నారు.
మడతలెట్టేసారు!
తీసుకెళ్ళి కొట్టించామనుకున్నారు..

ఇప్పుడు ఈయన కొట్టే కముకు దెబ్బలు తట్టుకునే పరిస్దితి లేదు.
ప్రతిరోజు చెరకు గానుగ ఆడించేసారు!
రసం పిండేసారు!

దొంగల నాయకుడు ఎంతో మంది కాళ్ళు పిసకాల్సి వస్తుంది..క్రమం తప్పకుండా!

సుదీర్ఘ విచారణలో ఉన్న కేసులు ఒక ఎత్తు!
ఐదేళ్ళ అరాచకం..పట్టపగలు దోపిడీ వేరే లెవల్!
వీటికి తోడు బాబాయ్ బాత్రూమ్ ఎపిసోడ్!

ఇన్ని పెట్డుకుని రెచ్చిపోవడం అంటే..తామునుగుతూ..ఇతరులని కూడా ముంచే ప్రయత్నమే!

అశోక్ గజపతి రాజు గారి నైతే..ఆకాశం మీద ఉమ్మారు!
తిరిగి అంతకు మించిన వేగంతో మొఖం మీద పడింది.

సత్యంరాజు గారి ఉసురు తగిలింది.

రఘురాజు గారు ఆయనే తాటతీస్తారు.ముప్పు తిప్పలు పెట్టి మూడుచెరువుల నీరు తాగిస్తాడు.
లోపలకు పంపేదాకా వదలడు!
నిను వీడని నీడను నేనే..! బాపతు!

అశోక్ రాజు గారు…ధర్మాన్ని కాపాడారు..ధర్మమే ఆయన్ని కాపాడింది.
ఈయనకు చేసిన అన్యాయానికి..అవమానానికి..దూషణలకు..గరుడపురాణాల్లోని శిక్షలు చాలవు..అంతకు మించి అనుభవిస్తారు!
చేసిన పాపం వదలదు.
ఇచ్చిన దానికి మూడు రెట్లు పొందే సమయం వచ్చేసింది!

– అడుసుమిల్లి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE