Suryaa.co.in

Telangana

సభాపతిని చూసి నేను సిగ్గుపడుతున్న

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అప్రజాస్వామికంగా- నిబంధనలకు విరుద్ధంగా సభ నడుస్తోంది.పాయింట్ ఆఫ్ ఆర్థర్ లెవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదు.పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం లెవనెత్తితే స్పీకర్ మర్యాద ఇవ్వరా?ఇది చట్ట సభనా? టీఆరెస్ పార్టీ ఆఫీసా?

మద్దతు ఇచ్చే వాళ్లకు మాత్రమే మైక్ ఇస్తున్నారు. సభలో సభ్యులను అవమాణిస్తున్నారు- సభా హక్కులను తుంగలో తొక్కుతున్నారు. సభా సంప్రదాయం ఉండదా?…మేము కూడా సభ నడిపాం.పాయింట్ ఆఫ్ ఆర్థర్ లెవనెత్తితే సభ్యులను స్పీకర్ అడగాలి.

సభ దుర్మార్గంగా నడుస్తోంది.సభ నడుపుతున్న తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాను. సభాపతిని చూసి నేను సగ్గుపడుతున్న. ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే మీ ఇల్లు కాదు. మేము కూడా గెలిచి వచ్చాము.సభ నడిపే తీరు ఇది కాదు. దీనికి భాద్యత స్పీకర్- శాసనసభ వ్యవహారాల మంత్రి వహించాలి.

శ్రీధర్ బాబు ఎమ్మెల్యే :
ఇవ్వాళ చాలా బాధ వేస్తోంది. పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం లెవనెత్తిన్నప్పుడు స్పీకర్ స్పందించాలి.రాజ్యాంగంలో ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ అడ్రెస్ చేయాలని స్పష్టంగా ఉంది.రాజ్యాంగం ప్రకారమే మేము పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం అడిగాం.సభలో కనీసం కూర్డినేషన్ లేకుండా సభ నడుస్తోంది.సభ వాయిదా పడి నాలుగు నెలలు గడుస్తున్నా సభ ప్రొరోగ్ ఎందుకు కాలేదని అడిగే ప్రయత్నం చేసాము. ప్రజల సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. సభలో సభ్యుల హక్కుల కాపాడలేదు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే:
ఇవ్వాళ స్పీకర్ రాజ్యాంగాన్ని అవమానించారు.ఈ అవమానం కాంగ్రేస్ పార్టీకి కాదు- తెలంగాణ ప్రజలకు.దళితుడు సీఎల్పీ లీడర్ గా ఉంటే కేసీఆర్ చూడలేకపోయారు.ఇది తెలంగాణ రాష్ట్రమా? తెలంగాణ రాజ్యమా? కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై- రాజ్యాంగం పై గౌరవం లేదని మరోసారి స్పష్టం అయింది.వెయ్యి మంది బలిదానాల తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం పాలైంది.కేటీఆర్ ను సీఎం చేసి- కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పోచారం ఒక బొమ్మగా మాత్రమే కూర్చున్నారు : జగ్గారెడ్డి ఎమ్మెల్యే
స్పీకర్ పద్ధలో పోచారం వ్యవహారం లేదు.స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక బొమ్మగా మాత్రమే కూర్చున్నారు. తెలంగాణ ఇప్పించిన- తెచ్చిన కాంగ్రేస్ సభ్యుల గొంతును సభలో కేసీఆర్ నొక్కుతున్నారు.కేసీఆర్ వ్యవహారశైలి ఎప్పటికైనా ప్రమాదమే.గుండా గిరి పరిపాలన కొనసాగుతోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కాంగ్రేస్ పార్టీని కాపాడుకోవాలి.
కాంగ్రేస్ అంటే ఏంటో చూపిస్తాం. ఇక పై స్పీకర్ పై పోరాటం కోమసాగుతుంది. మా ఓపిక నశించింది.

బీజేపీ- టీఆరెస్ పంచాయితీ అసెంబ్లీలో ఎందుకు?: సీతక్క, ఎమ్మెల్యే
టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్థర్ ను అడిగినప్పుడు స్పీకర్ మమ్ములను కన్నెత్తి చూడలేదు.రాజ్యాంగాన్ని కాపాడే స్పీకర్ బండ్రోతు లాగా అయ్యారు. బీజేపీ- టీఆరెస్ పంచాయితీ అసెంబ్లీలో ఎందుకు? గవర్నర్ ప్రసంగం పై సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండేది.గవర్నర్ ప్రసంగం లేకుండా బుల్డోజ్ చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఒక నాటకం మాత్రమే.

LEAVE A RESPONSE