టిడిపి కార్యకర్తల కుటుంబాలకు ‘భీమా’ భరోసా

– రాష్ట్రంలో కనిగిరికి తొలి భీమా చెక్కు ఉగ్రకు అందజేసిన చంద్రబాబు
– రూ.2 లక్షల చెక్కును కార్యకర్త కుటుంబసభ్యులకు అందజేసిన ఉగ్ర

కనిగిరి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమలు చేయటం హర్షించదగ్గ విషయమని కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ సభత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉండి భరోసానిస్తుందన్నారు.

వెలిగండ్ల మండలం హుస్సేన్ పురం గ్రామ పంచాయితీ పరిధిలోని పద్మాపురంకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తుముల మహేష్ రెడ్డి సోదరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముత్తుముల రవి ఇటీవల ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందాడు. టీడీపీ కార్యకర్త మృతి చెందిన సమాచారం తెలుసుకున్న Dr ఉగ్ర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఉగ్ర ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలసి ప్రమాద విషయాన్నీ అయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబ సభ్యులకు ప్రమాద భీమా కింద 2 లక్షల రూపాయల చెక్కును ఉగ్రనరసింహారెడ్డికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యుని కుటుంబానికి చంద్రబాబు నాయుడు నేనున్నానంటూ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటలో రాష్ట్ర స్థాయిలో కనిగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత క్రమంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మొదటి స్థానంలో, నారా లోకేష్ ప్రాతినిద్యం వహిస్తున్న మంగళగిరి రెండవ స్థానంలో ఉండగా కనిగిరి నియోజకవర్గం మూడవ స్థానంలో నిలిచింది. ఇటు సభ్యత్వ నమోదులోను అటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలోను కనిగిరికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దీనికి తోడు రాష్ట్రంలోనే మొదటి ప్రమాద భీమా 2 లక్షల రూపాయలు నగదు చెక్ కూడా కనిగిరికి కేటాయించడం జరిగింది.

కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ముందుంటాను అని చెప్తున్న ఉగ్ర దాన్ని కార్యరూపం చేసి చూపించాడు. ఏది ఏమైనా… ఉగ్ర ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు పోరాడే మనస్తత్వం కలవాడనే దానికి ఇదే నిదర్శనం. మంగళగిరిలో చంద్రబాబునాయుడు 2 లక్షల రూపాయల చెక్ ను ఉగ్ర కు అందజేసి బాధిత కుటుంబ సభ్యులకు అందించాలని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలియజేయాలని సూచించారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు వెలిగండ్ల మండలం పద్మాపురంలో ఉంటున్న బాధిత కుటుంబసభ్యులకు ప్రమాద భీమా చెక్ ను అందజేశారు. ప్రమాద భీమా చెక్కును అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు, కనిగిరి టిడిపి ఇన్ఛార్జ్ Dr ఉగ్రనరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు