Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ భరోసా

-రేపటి నుండి మూడు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమం
-ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న నిజం గెలవాలి
-చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు నిజం గెలవాలి కార్యక్రమంతో భువనేశ్వరి పరామర్శ
-గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన కార్యక్రమం ఈనెల 13న తిరువూరులో ముగింపు
-బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి
-ఇప్పటిదాకా 194 కుటుంబాలకు పరామర్శ…చివరి విడతలో మరో 9 కుటుంబాలకు పరామర్శ
-25 పార్లమెంట్ లలో 92 నియోజకవర్గాల్లో 194 కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరి
-8,478 కి.మీ ప్రయాణించి ప్రతి బాధిత కుటుంబానికి సాయం చేసిన భువనమ్మ

అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గతేడాది సెప్టెంబ్ 9న జరిగిన చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక పలువురు కార్యకర్తలు, అభిమానులు మృతి చెందారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు భువనేశ్వరి గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను భువనేశ్వరి నేరుగా పరామర్శించి, ఆర్థికసాయం అందించారు.

చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. నిజం గెలవాలి పర్యటన ప్రారంభం నుండి ఇప్పటిదాకా 194 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఈనెల 11, 12, 13వ తేదీలలో పరామర్శించే కుటుంబాలను కలుపుకుని మొత్తం 203 కుటుంబాలకు పరామర్శ పూర్తవనుంది. పరామర్శతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున భువనేశ్వరి ఆర్థికసాయం అందించారు. ఇప్పటి దాకా 25 పార్లమెంట్ ల పరిధిలో 92 నియోజకవర్గాల్లో 8,478కి.మీ ప్రయాణించారు.

గురువారం నుండి జరిగే మూడు రోజుల పర్యటనలో మరో 2 నియోజకవర్గాల్లో పర్యటించేవాటితో కలిపి మొత్తం 94 నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన పూర్తవనుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైన నిజం కార్యక్రమం ఈనెల 13న కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో ముగియనుంది.

ప్రజల మధ్యనే ఉంటూ…సమస్యలు శ్రద్ధగా వింటూ…
ఒకపక్క హెరిటేజ్ వ్యాపార వ్యవహరాలు, ట్రస్టు కార్యక్రమాలు, ఎన్టీఆర్ మోడల్ స్కూలు పనులు చూసుకుంటూనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిరంతరాయంగా కొనసాగించారు. తన పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి సాధకబాధలు విన్నారు. ప్రతి వారంలో నాలుగైదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో భువనేశ్వరి ప్రజల మధ్యనే గడిపారు.

క్షేత్రస్థాయిలో పేద విద్యార్థినులను కలిసి ఇబ్బందులను తెలుసుకున్న భువనేశ్వరి….కలలకు రెక్కలు అనే పథకాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారంటీతో వడ్డీలేని రుణాలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కార్యక్రమం ప్రారంభంలో ప్రత్యర్థి పార్టీల నేతలు రాజకీయ విమర్శలు చేసినప్పటికీ భువనేశ్వరి పట్టించుకోకుండా ముందుకు సాగారు

LEAVE A RESPONSE