Home » జగన్ రెడ్డి లూటీ తో ప్రజలపై రూ.27,442 కోట్ల భారాలు

జగన్ రెడ్డి లూటీ తో ప్రజలపై రూ.27,442 కోట్ల భారాలు

-కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరల పెట్టి రూ.20 వేల కోట్ల విద్యుత్ కొనుగోళ్లు
-జగన్ ప్రభుత్వ అసమర్థ పాలనతో విద్యుత్ కోతలతో ప్రజలకు అవస్థలు
-నర్సీపట్నంలో టార్చ్ లైట్ల వెలుగులో వైద్యుల ఆపరేషన్లు
-రాయితీతో నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత టీడీపీదే
-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం చౌదరి

విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తే నేడు రాష్ట్రంలో కారు చీకట్లకు కారణమని నాదెళ్ల బ్రహ్మం చౌదరి మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీలు, టారిఫ్‌ కుదింపు, స్లాబ్ మార్పులు, ఫిక్సుడ్ ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు అంటూ 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.27,442 కోట్లు భారాలు మోపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.2851 కోట్ల బకాయిల సొమ్ములు చెల్లించకుండా ఎన్నికల కోడ్ ఉన్నా అస్మదీయులకు మాత్రం రూ.16 వేల కోట్లు చెల్లించారంటూ మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి బ్రహ్మం చౌదరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

జగన్ ప్రభుత్వ అసమర్థ పాలన వలన నర్సీపట్నంలో టార్చ్ లైట్ల వెలుగులో వైద్యులు ఆపరేషన్లు చేసే దుస్థితి ఏర్పడిందని ఆగ్రహించారు. ఎండలు ముదరక ముందే కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ.. జగన్ రెడ్డి జేట్యాక్స్‌లు దండుకుంటున్నాడని మండిపడ్డారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరల పెట్టి విద్యుత్ ను కొనుగోళ్లు చేస్తున్నారని విమర్శించారు. 2019 నాటికి 19,680 మెగావాట్ల మిగులు విద్యుత్ ను చంద్రబాబు జగన్‌కు అప్పగిస్తే. జగన్ కమీషన్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై దాదాపు రూ.27,442 వేల కోట్ల భారాలు మోపారన్నారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 30 వేల కోట్లు అప్పులు తేవడమే కాకుండా.. నేడు ప్రజలకు కరెంట్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవ చేశారు. 70 సవంత్సరాలలో పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటించిన చరిత్ర ఈ దద్దమ ప్రభుత్వానిదేననన్నారు. లోటులో ఉన్న కరెంట్ ను చంద్రబాబు వచ్చాక ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి వస్తే..నేడు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితికి దిగజార్చారన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు కంటే రెండు మూడు రెట్లు అధిక ధరలతో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కరెంట్ ను కొనుగోలు చేయడాన్ని ఖండించారు.

కోల్ ఇండియా బకాయిలు చెల్లించకపోవడంపై బ్రహ్మం చౌదరి కన్నెర్ర
కోల్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.2851 కోట్ల బకాయిల చెల్లించకండా వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడాన్ని తప్పుబట్టారు.. బకాయిలపై సమాధానం చెప్పలేక కోల్ ఇండియా అధికారులు నిర్వహించిన మీటింగ్ కు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డుమ్మాకొట్టడం సిగ్గు చేటన్నారు. డుమ్మా కొట్టిన అధికారులపై చర్యలు తీసుకుని, కోల్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కోల్ సెక్రటరీ సీఎస్ కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

కోల్ ఇండియాకు బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ ఆగి చిమ్మ చీకట్లు అలుముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రజా సమ్యల పట్ల చిత్త శుద్దిలేకపోవడం శోచనీయమన్నారు. 2014 నుండి 2019 వరకు ఒక్క గంట కూడా కరెంట్ కోత లేదని తెలియజేశారు. వేసవిలో ఉన్న డిమాండ్ కు సరిపడ విద్యుత్ ను అందుబాటులో ఉంచుకోకుండా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించిన చరిత్ర టీడీదేని గుర్తు చేశారు.

Leave a Reply