Suryaa.co.in

Telangana

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని వల్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈదురు గాలుల కారణంగా మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది సమయానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని స్కైమెట్‌ అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దక్షిణాది పాటు పశ్చిమ, నైరుతిలోనూ సమృద్ధిగా వర్షాలు పడతాయని వివరించింది.

LEAVE A RESPONSE