Suryaa.co.in

Andhra Pradesh

నెల్లూరు జిల్లా లో బర్డ్ ఫ్లూ కలకలం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– మూడు నెలలు వరకు షాప్ లు తెరవకూడదు
– కలెక్టర్ హరి నారాయణన్

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లోని చాట్లగుట్ట,కోవూరు మండలం లోని గుమ్మళ్ళ దిబ్బ ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోయాయి, దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్… బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలో మీటర్లు పరిధిలో మూడు రోజులు చికెన్ షాప్ లు మూసేయాలని,ఒక కిలో మీటర్ పరిధి లో మూడు నెలలు వరకు షాప్ లు తెరవకూడదు అని ఆదేశించారు, చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలి అని,పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి అని, ఆ రెండు గ్రామాల్లో డిపివో,జిల్లా పరిషత్ CEO గ్రామ సభలు నిర్వహించాలి అని,ప్రజల్లో కోళ్ల పెంపకం దారుల్లో, చికెన్ షాప్ యాజమానుల్లో చైతన్యం తేవాలి ఆయా గ్రామాల పరిధిలో సానిటైజేషన్ చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకితే మానవ జాతి వూపిరి తిత్తుల మీద శ్వాసకోశ వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం వుంది అప్రమత్తం గా ఉండాలి..

LEAVE A RESPONSE