మనిషి మూత్రంతో విద్యుత్‌ తయారీ

– ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి

(తిలక్)

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ – పాలక్కాడ్‌ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్‌, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటీ బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది.

ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ను (ఈఆర్‌ఆర్‌ఆర్‌) రూపొందించారు. ఇది విద్యుత్‌ తో పాటు బయో ఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేస్తుంది విద్యుత్‌, బయోఫెర్టిలైజర్‌లను ఏకకాలంలో ఉత్పత్తి చేసే ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తూ ఈఆర్‌ఆర్‌ఆర్‌లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఫలితంగా విద్యుత్‌తో పాటు, బయో ఫెర్టిలైజర్‌ తయారవుతుంది. ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది వ్యవసాయానికి ఉపయోపపడుతుందని పరిశోధకలు చెబుతున్నారు.

ఈఆర్‌ఆర్‌ఆర్‌లో ఆనోడ్‌గా మెగ్నీషియం, క్యాథోడ్‌గా గాలిలోని కార్బన్‌ పనిచేస్తాయి. ఈ సమీకృత సాంకేతికత.. మూత్రంలోని అయానిక్‌ శక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రోకెమికల్‌ చర్యలను ప్రేరేపిస్తుంది. దానివల్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఉత్పత్తయిన విద్యుత్తును ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లను ఛార్జ్‌ చేసుకునేందుకు, ఎల్‌ఈడీ బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ టెక్నాలజీ కోసం సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ గంగాధరన్ నేతృత్వంలోని రీసెర్చ్ స్కాలర్ సంగీత వి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ శ్రీజిత్ పిఎం, డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ రిను అన్నా కోశితో కూడిన బృందం దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది.

ఈ ప్రాజెక్టుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), భారత ప్రభుత్వం (GOI) కింద సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (సీడ్) విభాగం ద్వారా నిధులు సమకూరుస్తుంది.

Leave a Reply