భారత్ ను రక్షించే ఉద్యమం

ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాయబారంలో కేవలం అయిదు ఊళ్లు అడిగాడు. కానీ ఇప్పుడు భారత దేశ రక్షణ కొరకు కేవలం అయిదు చట్టాలను చేయాలని కోరుతున్నాము.

ఉమ్మడి విద్యా విధానం (యూనిఫాం ఎడ్యుకేషన్)
ఉమ్మడి పౌర స్మృతి (కామన్ సివిల్ కోడ్)
మభ్యపెట్టే బలవంతపు మత మార్పిడి నియంత్రణ ( కన్వర్షన్ కంట్రోల్)
అక్రమ చొరబాట్ల నియంత్రణ ( ఇన్ ఫిల్టరేషన్ కంట్రోల్)
జనాభా నియంత్రణ ( పాపులేషన్ కంట్రోల్)

ఈ అయిదు చట్టాలు రాకపోతే భారత దేశంలో సనాతన ధర్మం పూర్తిగా అంతరించిపోతుంది. ఇప్పటికే భారత్ లోని తొమ్మిది రాష్ట్రాలలో మన ధర్మం కొడిగట్టింది.
ఇది భారత్ ను, ప్రకృతి వనరులను రక్షించే ఉద్యమం.,
మన ఆడపిల్లలను కాపాడే ఉద్యమం..

వీటిని డిమాండ్ చేయడం భారతీయుడిగా, హిందువులుగా మన బాధ్యత. ఇది అత్యాశ కాదు. భారతీయుడి చిరకాల స్వప్నం. హిందువుల దశాబ్దాల కోరిక. హిందూ దేశంలో హిందువుగా బతకాలన్న చిన్న ఆశ. అందుకే ఇవి నెరవేరాలని మోదీని కోరదాం. కోట్లాదిమంది హిందువుల ఆకాంక్షలు నెరవేర్చడం మోదీ నైతిక బాధ్యత. రాజకీయంగా బీజేపీపై దేశ ప్రజలు పెట్టుకున్న కోరిక కూడా ఇదే. మీరూ ఒక భారతీయుడిగా ఈ సందేశాన్ని కనీసం ఒకరికైనా పంపవలసిందిగా మా ప్రార్దన.

– సంపత్‌రాజు

Leave a Reply