సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో spouse కు PPO ద్వారా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు. అయితే సర్వీస్ పెన్షనర్ డెత్ సర్టిఫికేట్, సర్వీసు పెన్షనరుతో జాయింట్ అకౌంట్ గాని, లేదా spouse కు వ్యక్తిగతంగా పెన్షన్ ఆఫీసుకు టైఅప్ అయిన బ్యాంకులో అకౌంట్ గాని ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ , బ్యాంక్ అకౌంట్ xerox కాపీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డులను జాతచేస్తూ prescribed ABCD ఫారం ( revised ) నింపి, రెండవ పేజీలో spouse ఫోటో అతికించి, ఫోటో పై గెజిటెడ్ ఆఫీసర్ చేత ధ్రువీకరణ ( attestation ) చేయించి, spesimen signature దగ్గర 3 సంతకాలు చేసి, ఎడమ చేతి అంగుష్టాలు ( అన్ని వ్రేలి ముద్రలు ) వేసి ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ కోసం, డెత్ రిలీఫ్ కోసం, LTA ( ఆ నెలలో సర్వీసు పెన్షనర్ ఎన్ని రోజులు బతికి వున్నారో చనిపోయిన రోజును కూడా కలిపి యిచ్చే పెన్షన్ ను Life time Arrears LTA అంటారు ) కోసం ఫారంలో టిక్ చేసి పెన్షన్ అధికారులకు Submit చేయాలి.
ఒకవేళ సర్వీస్ పెన్షనర్ కన్న ముందు spouse చనిపోయినా అంత్యక్రియల క్రింద గత నెల పెన్షన్ కు సమానమైన మొత్తాన్ని 20వేలకు తగకుండా డెత్ రిలీఫ్ చెల్లిస్తారు. సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ యిద్దరు మరణించిన సందర్భంలో వెనుకకు మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ సంబంధిత తహశీల్దారుకు సమర్పించి తీసుకొన్న ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ DTO/STO/ APPO లకు సమర్పిస్తే 25 సంవత్సరాలు నిండని సంతానానికి Age ను బట్టి పెద్దవానితో మొదలు పెట్టి అందరికి ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.
25 సంవత్సరాలు నిండగానే అతనికి లేదా ఆమెకు పెన్షన్ నిలుపుదల చేసి రెండవ సంతానానికి ఆపై మిగిలిన అందరికి 25 సంవత్సరాల వరకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. సర్వీస్ పెన్షనర్ చనిపోతే spouse కు ఎంత పెన్షన్ వస్తుందో సంతానానికి యిచ్చే ఫామిలీ పెన్షన్ కూడా అంతే వస్తుంది. 25 సంవత్సరాలు పూర్తి అయినవారు అందరు అయిపోయిన తరువాత ఆ కుటుంబంలో సర్వీసు పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పై ఆధారపడిన విధవరాలైన కుమార్తె, కోర్టు ద్వారా చట్టబద్ధంగా విడాకులు పొందిన కుమార్తె, దివ్యా0గుడైన కుమారుడు లేదా కుమార్తె వీరెవరూ లేక పెన్షనర్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అర్హులు.
అయితే పెన్షనర్ మరణించక ముందే విధవరాలు అయి ఉండాలి. విడాకులు పొంది వుండాలి. వికలాంగులు అయి వుండాలి. మొదట వితంతువుకు, ఆ తర్వాత విడాకులు పొందిన కుమార్తెలకు ఆ తరువాత వికలాంగులైన సంతానానికి వారు బ్రతికి వున్నంతకాలం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు. అయితే వితంతురాలు విడాకులు పొందిన కుమార్తెలు మరల వివాహం చేసుకున్నా లేదా మినిమం పెన్షన్ కన్న వేరే ఆదాయం సంపాదించినా వారికి పెన్షన్ రద్దు చేస్తారు.
వికలాంగ సంతానానికి వేరే ఒక గార్డియన్ వుండాలి. 25 సంవత్సరాలు దాటిన ఆధార పడిన అవివాహిత కుమార్తె వుంటే పెళ్లి చేసుకోని పక్షంలో పెళ్లి చేసుకోలేదని, ఏ సంపాదన లేదని పెన్షనర్ పై ఆధారపడి బ్రతుకుతున్నదని తహసీల్దార్ తో సర్టిఫికేట్లు పొంది సర్వీస్ పెన్షనర్ ఎక్కడనుండి రిటైర్ అయ్యారో సర్టిఫికేట్లు జతపరిచి ఆ సంస్థ అధికారిచేత దరఖాస్తును AG కార్యాలయానికి సమర్పిస్తే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అవుతుంది.
– తూపురాణి సీతారాం
రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణా ఆల్ పెన్షనర్స్ & రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్
డిప్యూటీ సెక్రటరీ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల కార్యాచరణ సమితి ( JAC )
సెల్ : 8096066099