-కడపలో టీడీపీ-జనసేన సత్తా చాటాలి
-కడపలో జగన్‌కు దిమ్మతిరిగే ఫలితం ఇవ్వాలి
-జగన్ కడపకు చేసిందేమీ లేదు
-జగన్ పుణ్యాన కడప అప్రతిష్ఠపాలయింది
-ఏపీని నిలుపు దోపిడి చేసింది జగన్ అండ్ కో
-రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిది
-దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు
-రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు
– మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
కడప : రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డి సొంత కడప జిల్లాలో వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా ప్రజలదేనని మాజీ మంత్రి, సతె్తనపల్లి టీడీపీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కడపకు వచ్చిన కన్నా టీడీపీ-జనసేన కార్యకర్తలతో భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన కలయిక చారిత్రక అవసరమన్నారు. భేషజాలు లేకుండా చంద్రబాబునాయుడు-పవన్ కల్యాణ్ కలసి చర్చించుకుంటున్నారని, రెండు పార్టీల శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో కలసి పనిచేయడం శుభపరిణామమన్నారు. ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, సమన్వయంతో పని పొత్తు అభ్యర్ధులను గెలిపించాలని పిలునిచ్చారు.
కన్నా ఇంకా ఏమన్నారంటే.. ఒక సీఎం సినిమాకు భయపడటం తన జీవితంలో తొలిసారి చూస్తున్నాను. వైసీపీ వాళ్లు జగన్‌రెడ్డిని పులివెందుల పులి అని పొగుతుంటారు. కానీ ఆయన మాత్రం పిల్లిలా ఒక సినిమా విడుదల కాకుండా థియేటర్ల వద్దకు పోలీసులను పంపుతున్నారు. అంటే జగన్‌రెడ్డి పిల్లి కూడా కాదని అర్ధమవుతుంది. కడప జిల్లాకు జగన్ చేసిందేమీ లేదు. పైగా జిల్లాలోని ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. జిల్లా నిండా ఆయన బినామీలే. గనులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టులన్నీ జగన్ మనుషులవే.
రైతుల బతుకు చిత్రం పై తీసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారింది. సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటి? ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో వైసీపీ కోర్టుకు వెళ్లింది. 34 వేల మంది రైతుల త్యాగాలకు వాస్తరూపంగా నిలిచింది రాజధాని ఫైల్స్ వేల మంది రైతుల త్యాగాలను బూడిదలో పోసిన పన్నీరును చేశాడు ఈ సైకో సీఎం. అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు జగన్ రెడ్డి.
5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని ఛిద్రం చేసిన తుగ్లక్ సీఎం జగన్. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చాడు. మడమ తిప్పని నేత ఆంధ్రుల రాజధాని అమరావతిపై యూటర్న్ తీసుకున్నాడో చెప్పాలి.
జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయి. తెలుగుదేశం పార్టీకి వస్తున్న మైలేజ్ ను చూసి ఓర్వలేక సైకో చేష్టాలు చేస్తున్నారు. రాజధాని నిర్మించడం వైసీపీకి రాదు…. నిర్మించిన అనుభవం కూడా లేదు. చంద్రబాబు నాయుడు మహోపవేతంలా ప్రారంభించిన అమరావతిని కావాలనే అడ్డుకున్నారు.
నిన్నటి దాక మూడు రాజధానుల పాట పాడిన వైసీపీ నేడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని అంటుంది. పక్క రాష్ట్రాల దగ్గర రాజధానిని కావాలి అని అడుక్కునే స్థాయికి ఏపీని దిగజార్చింది టీం సైకో. మూడు రాజధానుల పేరుతో ఏపీని నిలుపు దోపిడి చేసింది జగన్ అండ్ కో. ఈ ఐదేళ్లలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిది.