– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం
పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా ? ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా ? గొంతు పిసికి చంపాలని చూస్తారా ? గూండాలను పక్కన పెట్టి మరి దాడులు చేయిస్తారా ? మీరు పోలీసులా లేక వైసీపీ కిరాయి మనుషులా ? ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు.? కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటన పై వెంటనే డీజీపీ స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి.