ఢిల్లీలో మద్యం మాఫియా తీగ లాగడంతో.. భయంతో ఢిల్లీ వెళ్లిన జగన్ రెడ్డి

• ఏపీలోని లిక్కర్ మాఫియా గుట్టు బయటపడకుండా ఢిల్లీలో జగన్ రెడ్డి మంతనాలు
• ఏ2 విజయసాయి రెడ్డి అల్లుడి సన్నిహితుడితో జగన్ రెడ్డి లిక్కర్ మాఫియా
– మాజీ మంత్రి కెఎస్ జవహర్ 

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 22 సార్లు ఢిల్లీ పర్యటించారు. జగన్ రెడ్డి సొంత, బహుళ ప్రయోజనాలకి మాత్రమే పర్యటనలు చేస్తున్నారు. నేడు ప్రధానంగా దేశాన్ని కుదిపేస్తున్న లిక్కర్ మాఫియా ఢిల్లీ వేదికగా ఏ విధంగా జరుగుతుంది, దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉన్నాయని గమనించాలి. జగన్ రెడ్డి హుటాహుటిన పర్యటన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం ఉందని కెఎస్ జవహర్ అన్నారు. మంగళగిరి టిడిపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….

జగన్ రెడ్డి ఎంపీలు, అరబిందో, డర్టీ మాధవ్ కు సంబంధించిన మూలాలన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నారు. ఈ నిజాన్ని దాచి పెట్టి వేరే ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళినట్టు ప్రజలను మభ్యపెడుతున్నాడు. జగన్ రెడ్డి పర్యటనలలో తేదీ మారుతుంది తప్ప విషయం మాత్రం మారదు. లిక్కర్ మాఫియా మూలాలను కప్పిపుచ్చెందుకే ఆకస్మిక ఢిల్లీ పర్యటన. రాష్ట్రాన్ని దొచేస్తున్న, ప్రజల ప్రాణాలు తీస్తున్న తన అనుచరులను కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ, తాపత్రయం ప్రజల సమస్యలపై లేకపోవడం సిగ్గుచేటు. ఎ2 విజయసాయి రెడ్డి అల్లుడికి అత్యంత సన్నిహితుడు, లిక్కర్ మాఫియాలో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తుల్ని కాపాడడంలో జగన్ నిమగ్నుడై ఉన్నారు. ఈ మాఫియాలో జగన్ రెడ్డి పాత్ర కూడ ఉందన్నారు.

స్వప్రయోజనం ఉంటే తప్ప తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి జగన్ రెడ్డి బయటికి రాడు. లిక్కర్ మాఫియాని కాపాడటం, వివేకా హత్య కేసులో సునీతమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో తాడేపల్లిలోని జగన్ వెన్నులో వణుకు పుట్టింది. బాత్ రూమ్ మర్డర్ కేసులో తమ జాతకం బయటపడుతుందనే భయం జగన్లో స్పష్టం గా కనిపిస్తోంది.
సుప్రీం కోర్టు చొరవతో దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే వివేకా హత్య కేసులో ప్రధాన పాత్ర వహించిన వారి పేర్లు బయటికొస్తాయి, నిష్పక్షపాత విచారణ జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి శత విధాలుగా చేసే ప్రయత్నాలలో భాగంగానే జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన జరుగుతుంది. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి పోలవరం ప్రాజెక్ట్, నిర్వాసితులు అని జగన్ రెడ్డి సొల్లు కబుర్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రోజెక్ట్ లా తయారైంది. ముంపు నిర్వాసితులకి, పోలవరం నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడ జగన్ రెడ్డి తీసుకురాలేదు.

చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం నిర్మాణానికి 55వేల కోట్లు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పిస్తే… దాన్ని విమర్శించిన జగన్ రెడ్డి, ఈ రోజు అదే 55వేల కోట్ల రూపాయలు మంజూరు చేయమని తిరుగుతున్నాడు. జగన్ రెడ్డి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిప్పలుపడతాడు కాని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్వాసితులు కోసం పని చేయడంలేదు. పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీల గురించి జగన్ రెడ్డి ఎందుకు నిలదీయండం లేదు.?. 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానాన్న జగన్ రెడ్డి నేడు సొంత ప్రయోజానాల కోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పెట్టుకుంటున్నాడు. 22 సార్లు మాత్రమే కాదు 66 సార్లు జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా తన అవినీతి సామ్రాజ్య విస్తరణ కోసంమే కృషి చేస్తాడు తప్ప రాష్ట్రం కోసం ఏమీ చేయడు. చేయాలేడు.

దేశం అంతా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించేలా జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. జగన్ రెడ్డిని దూరంగా పెడితే కాని రాష్ట్రాన్ని కాపాడుకోలేం. ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలేంటి జగన్ రెడ్డి పత్రికా ముఖంగా తెలపాలి. ఢిల్లీకి జగన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళుతున్నారు. పర్యటనలలో రాష్ట్రానికి ఏం హామీలు తీసుకొచ్చాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ఏం కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు?

ఢిల్లీ మెదటి సారి పోలవరం ఎత్తు గురించి, రెండవ సారి లిక్కర్ గురించి, మూడవ సారి తన చెల్లి గురించి, నాల్గవ సారి తన అనుచరులని కాపడటానికి వెళ్ళాడని చెబుతారా.? జగన్ రెడ్డి 22 ఢిల్లీ పర్యటనల వివరాలు బయట పెట్టాలి. సాధించిన ప్రయోజనాలు, వెళ్లి రావడానికి అయిన కర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రజల డబ్బులని జగన్ రెడ్డి సొంత ప్రయోజనాలకి పర్యటించి వృథా చేయడం తప్పు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థలకి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన కీర్తి జగన్ రెడ్డిది. 23వ సారి ఢిల్లీ వెళ్లేటప్పడైనా ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక విధానం, ప్రత్యేకహోదా గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని తాకట్టు పెట్టిన జగన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

లిక్కర్ మాఫియాలో బయటపడ్డ బ్లాక్ లీస్ట్ లో ఉన్న కంపెనీలకు కూడ టెండర్ కు వెసులు బాటు అవకాశం ఏ విధంగా వచ్చిందో జగన్ రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు. బ్లాక్ లీస్ట్ కంపెనీల మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్, బహుళార్థక ప్రాజెక్ట్ పోలవరం, రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రం పరువును ఎప్పుడో తీసేశారు. మరోసారి ఢిల్లీ వేదికగా చేసుకొని కుంభకోణాల్ని చేస్తున్నాడు జగన్ రెడ్డి. కల్తీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తూ తానొక్కడే చెడిపోకూడదు దేశమంతా చెడిపోవాలనే రీతిలో వ్యవహిరిస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన అనుచరుల కల్తీ మద్య వ్యాపారాన్నిదేశ వ్యాప్తంగా విస్తరించడానికి పర్యటనలు చేస్తున్నారు. కంపెనీ లైసెన్స్ ల గురించి అరుణ్ రామచంద్ర పిళ్ళై, సమీర్ మహేంద్ర నుంచి 2.4 కోట్ల ముడుపులు అందాయి.

అరబిందో ఇండస్ట్రీస్ కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి పేరు లిక్కర్ స్కాంలో వినిపిస్తోంది. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడుగా చెబుతున్నారు. మరో వైపు లిక్కర్ వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న మాగుంట పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కంపెనీలు మూడు చోట్ల సిండికేట్లను దక్కించుకున్నాయి. ఇందు కోసం రూ. కోట్లను మడుపులుగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. మత్తు పదార్థాల విస్తరణకు ప్రధానం ఆంధ్రప్రదేశ్ అయింది.

Leave a Reply