Suryaa.co.in

Telangana

తెలంగాణలో బిజెపి దే అధికారం

– రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్

జమిలీ ఎన్నికల అంటే ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పలు బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రత్యేక సమావేశాలు పెడితే ప్రతిపక్షాలు ఎందుకు బయపడుతున్నాయని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికల మీద విమర్శలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం కొడుకు తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేస్తే నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు.. ప్రతిపక్షాలకు హిందువుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం లో మేకల కీర్తి హర్ష కిరణ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్ ప్రారంభోత్సవం మరియు అర్హులైన శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్ లను మహిళలకు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కె. లక్ష్మణ్ హాజరయ్యారు, ప్రధాని మోడీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని మహిళలకు చట్ట సభల్లో సముచితస్థానం కల్పించారని, మహిళలకు ఆత్మగౌరవ నిలయాలుగా స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించారని కె. లక్ష్మణ్ తెలిపారు.

ఈ సందర్భంగా మహిళల కోసం కంప్యూటర్ కోచింగ్ సెంటర్, కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకురాలు మేకల కీర్తి హర్షకిరన్ ను లక్ష్మణ్ అభినందించారు.. నియోజకవర్గంలో పలు డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మేకల కీర్తి హర్ష కిరణ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలబడుతున్నారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

పేద ప్రజలకు అండగా నిలబడే బిజెపికి వచ్చే ఎన్నికలలో తప్పకుండా పట్టం కడతారని అన్నారు. కార్యకర్తలు అందరూ బిజెపి గెలుపు కోసం ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అధికారం రావడం ఖాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, ఆదమ్ విజయ్ కుమార్, కనకట్ల హరి,కందటి నాగేశ్వర్ రెడ్డి, కన్నాభిరామ్,శ్యాంసుందర్, బిక్షపతి యాదవ్, ఆకుల శ్రీనివాస్, ఆకారం రమేష్ ముదిరాజ్,డివిజన్ అధ్యక్షులు హనుమంతు ముదిరాజ్, శ్రీధర్, రాము వర్మ,దత్తు, రాజ్ కుమార్ నేత,ఆకుల సంపత్,రత్నాకర్,మనమెలా శ్రీనివాస్,ఆనంద్,వెంకటేష్ యాదవ్,అనిత,అనూష, సరోజ ,శ్రీకాంత్,మహిళా అధ్యక్షురాలు,లావణ్య,భానుమతి, సత్యవతి, శోభ రాణి, మంజుల, అనూష నాగమల్లేశ్వరి, సరోజ, ఇందిరా,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE