Suryaa.co.in

Andhra Pradesh

నాగేంద్ర కుమార్ పై దొంగ కేసులు నమోదు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం

• దండా నాగేంద్రకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తే ఏపీ ప్రభుత్వానికి వంద కోట్లు ఫైన్ వేసి, ఇసుక తవ్వకాన్ని ఆపించారు
• అక్రమ ఇసుక తవ్వకాన్ని ఆపించినందుకు నాగేంద్ర కుమార్ పై దొంగ (తప్పుడు) కేసులు నమోదు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

దండా నాగేంద్రకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తే ఏపీ ప్రభుత్వానికి వంద కోట్లు ఫైన్ వేసి, ఇసుక తవ్వకాన్ని ఆపించారని, అక్రమ ఇసుక తవ్వకాన్ని ఆపించినందుకు నాగేంద్ర కుమార్ పై దొంగ(తప్పుడు) కేసులు నమోదు చేయడాన్ని మేము ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…

రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలను అవలంబిస్తూ.. ప్రశ్నించే గొంతుకలను శిక్షిస్తోంది. అవినీతిపై పోరాటం చేసేవారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. అవినీతిపై పోరాడే సమాజ సేవకుడు (విజిల్ బ్లోయర్) దండా నాగేంద్రకుమార్ పై దొంగ (తప్పుడు) కేసులు నమోదు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. దండా నాగేంద్రకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి వంద కోట్లు ఫైన్ వేశారు.

ఇసుక తవ్వకాన్ని ఆపించారు. ప్రభుత్వాన్ని ఇసుక తవ్వకం ఆపమన్నందుకు నాగేంద్రను శిక్షిస్తారా? ఇదెక్కడి న్యాయం?. నాగేంద్ర కుమార్ 29వ తేదీన ఢిల్లీలో ఉంటే, మిర్యాలగూడలో ఉండి 700 లిక్కర్ సీసాలతో పట్టుకున్నట్లుగా అతనిపై దొంగ కేసు నమోదు చేస్తారా? అతని కారులో 59 మద్యం బాటిళ్లు దొరికినట్లు దొంగ కేసు పెడతారా?

నాగేంద్ర 29న ఢిల్లీ వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్ ఆధారాలున్నాయి, మరి అదే రోజు మిర్యాలగూడలో ఎలా ఉంటారు? పెదకూరపాడు ఎమ్మెల్యే కు అవినీతి సొమ్మంటే చాలా ఇష్టం. అవినీతి సొమ్ముకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గండికొట్టిందనే అక్కసుతో, ఇసుక అక్రమ రవాణా ఆగిపోయిందన్న బాధతో నాగేంద్రకుమార్ పై పెదకూరపాడు ఎమ్మెల్యే కక్ష గట్టాడు. పెదకూరపాడు ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాగేంద్రపై దొంగ కేసు పెట్టబడింది.

రక్షించాల్సిన ప్రభుత్వం శిక్షించడానికి నడుంకడితే.. కంచే చేను మేసినట్లు కాదా? ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దండా నాగేంద్రకుమార్ పై దొంగ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబు? అవినీతిని బయట పెట్టే విజిల్ బ్లోయర్స్ కు రక్షణేది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చే పల్నాడు ఎస్పీ, అమరావతి సీఐ, ఎస్ఐ సుభానిలపై ఎంక్వైరీ చేయించాలి.

దొంగ కేసులు పెట్టడం మానుకొని, నర్సరావుపేట ఎస్పీని ట్రాన్స్ ఫర్ చేసి, దొంగ కేసు పెట్టిన సీఐ, ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతిపై పోరాటం చేస్తే ఈ ప్రభుత్వానికి నచ్చదు. అవినీతిపై పోరాటం చేసేవారిని ఎంతమందినని అరెస్టు చేయగలరు? ఇసుక తవ్వకం తప్పు, అక్రమ తవ్వకం చేయకూడదు అని చెప్పినందుకు ఓ వ్యక్తిని శిక్షించడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. పల్నాడు ఎస్పీ రూలింగ్ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు అందరికీ అర్థమైంది.

అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసినందుకు దండా నాగేంద్ర కుమార్ ను అరెస్టు చేసి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కు తిప్పారు. తీసుకెళ్లొద్దని కారుకు అడ్డంగా పడుకున్న నాగేంద్ర కుమార్ భార్య కారుకు అడ్డంగా పడుతకుంటే ఆమెను లాగి అవతల పడేశారు. టీడీపీ తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కమాండ్ కంట్రోల్ కు మెసేజ్ పంపాము. ఎందుకు అతడిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించాం. డీజీపీతోపాటు నర్సాపురం ఎస్పీకి కూడా మెసేజ్ పంపాము. సమాధానం దొరకలేదు.

చివరకు అతన్ని మేజిస్ట్రేట్ వద్దకు రిమాండుకు పంపారు. మేజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్టు సరిగా లేదని వెనక్కి పంపారు. ఇది ఒక దొంగ కేసులో భాగం. విజిల్ బ్లోయర్ నాగేంద్రకుమార్ వద్ద ఉన్నట్లు చూపిస్తున్న లిక్కర్, మద్యం బాటిళ్లు ఎస్ ఐ తెచ్చారో, సీఐ తెచ్చారో దర్యాప్తు జరపాలని కోరుతున్నాను. ఏదైనా పోలీసు స్టేషన్ లో సీజ్ చేసిన సిసాలు తెచ్చారమో అనే అనుమానం కలుగుతోంది. ఎమ్మెల్యే చెబితేనే దొంగ కేసు పెట్టినట్లుగా బాగా అర్థమవుతోంది.

ఇసుక అక్రమ రవాణాని ఆపినందుకే ఈ శిక్ష. జగన్ చేస్తున్న ఈ నిర్వాకాలను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. జగన్ ఏ రకంగా పరిపాలిస్తున్నాడు? వారి పార్టీ ఏ రకంగా ఉంది? పోలీసు శాఖ ఏవిధంగా పనిచేస్తోంది, డీజీపీ పనితీరుని ప్రజలు గమనించాలి. పోలీసుశాఖ ఇలా చేసుకుంటూ వెళితే పోలీసు వ్యవస్థ పరువు పోతుంది. పోలీసులను ఎవరూ నమ్మరు.

న్యాయశాస్త్ర కోవిదులు, న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దండా నాగేంద్ర లాంటి విజిల్ బ్లోయర్స్ కు అండగా నిలవాలి. నాగేంద్ర కుమార్ లాంటి విజిల్ బ్లోయర్ ని రక్షించుకోవాలి, లేకుంటే మర్డర్లు జరిగినా, రేపులు జరిగినా చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. మేం అధికారంలోకి వచ్చాక సీఐ, ఎస్ ఐలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. లోకేష్ ఎర్ర పుస్తకంలో సీఐ, ఎస్ ఐల పేర్లు ఎక్కాయని గుర్తు పెట్టుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE