Suryaa.co.in

Andhra Pradesh

సీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర

– ఎయిమ్స్ లో ఏచూరికి డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు
– పక్క బెడ్డులోనే స్వైన్ ఫ్లూ పేషెంట్ ను ఎలా ఉంచుతారు?
జగన్ ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదం
– డిక్లరేషన్ ఇస్తే నీ అహం పోతుందా?
– సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కాళ్లు, చేతులు కట్టేసి, ముసుగు వేసి, పోలీసులు చేత కొట్టించడం మానవత్వమా?
– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

తిరుపతి: మానవత్వం, సెక్యులరిజం, దళితులు, అవినీతి గురించి మాట్లాడేందుకు జగన్ సరైన వ్యక్తి కాదు. నిన్న జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. జగన్ ప్రసంగం నాకంత ఆహ్లాదకరంగా అనిపించలేదు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కాళ్లు, చేతులు కట్టేసి, ముసుగు వేసి, పోలీసులు చేత కొట్టించడం మానవత్వమా? జగన్….. 2004 ముందు మీ ఇంటి ఆస్తులు ఎంత? నేడు మీ కుటుంబం ఆస్తులు ఎంత? అవినీతి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు.

జగన్ కి ప్రజాదరణ పూర్తిగా పోయింది. నాలుగేళ్లు సైలెంట్ గా ఉండు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేసి, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపేసి, నేడు దళితుల గురించి జగన్ మాట్లాడడం విడ్డూరం. నిన్నా మొన్నటి వరకు మోడీ అమిత్ షా లకు జగన్ ముద్దులు పెట్టాడు. ఐదేళ్లు బిజెపి భజన చేసిన జగన్, ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదం.

డిక్లరేషన్ ఇస్తే నీ అహం పోతుందా?అడిగారు సంతకం చేసి ఇస్తే సరిపోయేది. టీటీడీలో అవినీతి ఉందని నేను చెప్తూనే ఉన్నాను. సత్రాలు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో ముడుపులు చేతులు మారాయి. వస్త్రం, బ్రేక్ దర్శన టికెట్లు వేల సంఖ్యలో అమ్ముకున్నారు.

సీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర. ఢిల్లీ ఎయిమ్స్ లో సీతారాం ఏచూరి అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది. ఎయిమ్స్ లో ఏచూరికి డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఐసీయూలో ఒక వీఐపీని ఉంచి, పక్క బెడ్డులోనే స్వైన్ ఫ్లూ పేషెంట్ ను ఎలా ఉంచుతారు? సీతారాం మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. దీని గురించి దేశం మొత్తం ఆలోచించాలి.

హర్యానా ఎన్నికల్లో బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. రాబోవు ఆరు నెలల్లో బిజెపి పతనం ఖాయం. లడ్డు, నెయ్యి, పవిత్రత గురించి మాట్లాడడం విడిచిపెట్టి , నిరుద్యోగం గురించి ఆకలి గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. కూటికోసం ఎంటెక్, ఎంబీఏలు చదివిన విద్యార్థులు కూలికి పోతున్నారు. దేశం గురించి, నిరుద్యోగ సమస్య గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి.

మా తిరుపతి లడ్డు గురించి, పవిత్రత గురించి మేం చూసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బాపిరాజు చైర్మన్ గా ఉన్న రోజుల్లో తిరుమల లడ్డు ఎంతో బాగుండేది. టీటీడీ లో పనిచేసే పది వేల మంది శాశ్వత ఉద్యోగులు చాలా మంచి‌‌ వాళ్ళు. టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమలు పరచడమే వారి విధి.

సిట్ విచారణ పేరుతో టీటీడీ ఉద్యోగుల జోలికొస్తే మేం ఊరుకోము. ఎలుకను పట్టేందుకు కొండను తవ్వాల్సిన పనిలేదు. తిరుపతిలో పదివేల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు పాడి పరిశ్రమ అప్పగిస్తే, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే స్వచ్ఛమైన నెయ్యి టీటీడీకి ఇస్తారు. టిటిడి కి అవసరమైన నెయ్యిని ఎక్కడినుంచో బ్రోకర్లకు ఆర్డర్లు ఇచ్చి తెప్పించాల్సిన అవసరం లేదు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గోపి గౌడ్, రవి, తేజోవతి, శాంతి యాదవ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE