Suryaa.co.in

Political News

దక్షిణాదిలో బీజేపీకి దిక్కెవరు ?

  • ఉత్తరాదిలో నితీశ్ ఏం చేయగలరు ?

నితీశ్ కుమార్ ఎన్డీయేను వీడిపోవడం కేవలం బీహార్ కి సంబంధించిన సంగతి కాదు. నేషనల్ ఇష్యూ. ఇప్పుడిక దుష్యంత్ చౌతాలా, అనుప్రియ పటేల్, ఏక్ నాథ్ షిండే లాంటి వాళ్లు తప్ప… పేరు, ఫేసు ఉన్న చంద్రబాబు లాంటి నాయకులు ఎవరూ ఎన్డీయేలో లేరు. పైగా నితీశ్ ఎఫెక్ట్ ఎంత లోతున ఉంటుందా అని లెక్క తీస్తే కళ్లు బైర్లు కమ్మే నంబర్లు కనిపిస్తున్నాయ్.

బీహార్ లో 40 లోక్ సభ సీట్లు ఉన్నాయ్. పోయిన ఎన్నికల్లో యూపీయేకి కేవలం ఒక్క సీటే వచ్చినా… ఇప్పుడు జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్ లో 66 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయ్. అంటే వచ్చే జనరల్ ఎన్నికల్లో బీహార్ క్లీన్ స్వీప్ దాదాపు ఖాయం అంటే కాదనలేం ఇప్పటికైతే ! ఇక బెంగాల్లో ఘర్షణలతో బీజేపీ దూకుడు పెంచుతోంది. అడ్డుకునేందుకు సోషల్ ఇంజినీరింగ్ చేసేంత ఆలోచన మమతకు లేకపోయింది.బెంగాల్లో మొత్తం సీట్లు 42. ఆమెకు ఓ ఐడియలాగ్ సహకారం అవసరం. 80 సీట్ల యూపీలో బీజేపికి ప్రస్తుతం 62 సీట్లున్నా… అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన లెక్కల్ని బట్టీ వచ్చేసారి సమాజ్ వాదీ కనీసం 28 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. అంటే బీజేపీని 40 సీట్లకు కట్టడి చేసే ఛాన్సు కనిపిస్తోంది ! ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని గుంజుకున్న మధ్యప్రదేశ్ లో 29 సీట్లు, మహరాష్ట్రలో 48 లోక్ సభ సీట్లూ ఉన్నాయ్. చితక రాష్ట్రం జార్ఖండ్ లో 14 సీట్లున్నాయ్. అంటే ఈ 6 రాష్ట్రాల్లోనే 253 లోక్ సభ స్థానాలున్నాయ్.

సరిగ్గా నితీశ్ టార్గెట్ ఈ అరడజను రాష్ట్రాలే ! ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కి పెద్దరికం లేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు బీహార్ లో కూడా కాస్తో కూస్తో బలం ఉన్నా నడిపించే నాయకత్వం లేదు. పైగా ఇదంతా నిఖార్సైన బీసీ బెల్ట్. అంటే ఒక రాష్ట్రం మరో ప్రాంతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్న మాట. అఖిలేశ్ కి చెప్పలన్నా తేజస్వీకి మార్గదర్శనం ఇవ్వాలన్నా ఇప్పటి వరకూ ఎవ్వరూ లేరు. పైగా మమతను హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదు. ఇవన్నీ కాంగ్రెస్ వల్ల కావడం లేదు. ఇప్పుడు నితీశ్ ఈ బాధ్యత సులభంగా తీసుకునే ఛాన్సుంది. మచ్చలేని నాయకుడు. సాఫ్ట్ ఫేస్. ఇమేజ్ ఉంది. ఇప్పటికిప్పుడు సీఎమ్మే అయినా… మరో ఏడాది తిరిగే లోపు తేజస్వీకి పగ్గాలప్పగించి తాను ఢిల్లీ దండయాత్ర ప్రకటిస్తే బీజేపీకి టైట్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ అరడజను రాష్ట్రాల్లోనూ ఇప్పటికే బీజేపీ ఎంత కెలకాలో అంతా కెలికేసింది. సానుభూతి పరులు, పొత్తులు లేనేలేవు. అందుకే ఈ 253 సీట్లలో విపక్షాలు సగం కాదు మూడో వంతు టార్గెట్ చేస్తే బీజేపీకి కష్ట కాలమే !

ఇక సౌత్ సంగతి. కర్ణాటకలో సొంత పార్టీలో తన్నులాటలతో, ఇమేజ్ లేని నాయకత్వంతో బీజేపీ కొట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. అంటే 28 సీట్లున్న చోట ఎక్కువగా ఆశించడానికేం లేదు. తమిళనాడులో 39 ఉన్నా ఆశల్లేవ్. కేరళలో 20 సీట్లుంటే బీజేపీకి గుండు సున్న. ఏపీలోని 25 చోట్లా స్కోపు లేదు. తెలంగాణలో 17 చోట్ల దిగినా ఎన్నొస్తాయో గ్యారెంటీ లేదు. అంటే ఐదు రాష్ట్రాల్లో ఉన్న 129 సీట్లలో బీజేపీకి డబుల్ డిజిట్ రావడం కూడా గగనమే ! ఆ ఆరు రాష్ట్రాల్లో 253 + 129 = 382లో బీజేపీకి అష్టదిగ్బంధం ఖాయం. ఇక పశ్చిమంలో గుజరాత్, రాజస్థాన్ లో 51 సీట్లలో హండ్రెస్ పర్సెంట్ బీజేపీ ఉన్నది. ఇక్కడ ఈసారి అన్ని వస్తాయన్న నమ్మకం ఆ పార్టీకి కూడా లేకపోవచ్చు. అంటే ఈక్వేషన్ ఈజ్ వెరీ క్లియర్. 2024. దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింట్ టు బి రియల్లీ రియల్లీ టైట్.

మోడీ, అమిత్ షా అన్ని పార్టీలతోనూ సున్నం పెట్టుకున్నారు సరే ! పైగా, ఇతర పార్టీలతో మాట్లాడగలిగిన స్థాయి, సామర్థ్యం ఉన్న చంద్రబాబు లాంటి నాయకులు లేకపోవడం బీజేపీకి మరో పెద్ద లోటు. బీహార్ సంగతే చూడండి. అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ లేదు అలయెన్స్ లో ! ఎందుకంటే ఢిల్లీలో జైట్లీ, పట్నాలో సుశీల్ మోడీ – నితీశ్ ను ఫెసిలిటేట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కి తనతో మంత్రాంగం నడిపే స్థాయి లేదని నితీశ్ తిప్పికొట్టారు. పైగా ఇలాంటప్పుడే జేడీయూను కబళించాలని కమలం చేసిన ప్రయత్నం వికటించింది. అందుకే, ఇప్పుడు ఆలోచన, లైజొనింగ్, సామర్థ్యం ఉన్న నాయకులు అవసరం. దక్షిణాదిలోనూ అదే కొరత. వెంకయ్య ప్లేస్ భర్తీ చేసేదెవరు ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెదుక్కోవడం, కొత్త స్నేహాలు చేయడమో లేదంటే పాత మిత్రుల్నే మళ్లీ కౌగలించుకోవడమో చేయడం బీజేపీకి అత్యవసరం. ఎందుకంటే హాలత్ బహుత్ ఖరాబ్ హై అందుకే బిజెపి చంద్రబాబు వైపు చూస్తోంది కానీ భారతీయ జగన్ పార్టీతో టిడిపి చాలా జాగ్రత్తగా ఉండాలి.

-ప్రత్తిపాటి

LEAVE A RESPONSE