-ఎవడు ఎన్ని ట్రిక్కులు పన్నిన కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టుడు పక్కా?
-మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు.గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్. ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది.వచ్చే ప్రభుత్వంలో ఆటో కార్మికులు రవాణ కార్మికుల కోసం ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం.వీ ఒ ఏ లకు, ఆర్పీ లకు మీ వేతనాలు పెంచే బాధ్యత మాది.
మీ వేతనాలు రెండింతలు పెంచుతాం.మహిళల కోసం మంచి నీటి బాధ తీర్చింది కేసిఆర్. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పారు కేసిఆర్. ప్రతి పక్ష నాయకులు ఒక్కడు కూడా మంచి నీళ్ళ కోసం ఇప్పుడు అడగటం లేదు,మాట్లాడటం లేదు. మహిళా రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు కేసిఆర్. సంగారెడ్డి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ అమ్ముకోవడానికి బీజేపీ కేంద్రం ప్రయత్నం చేస్తోంది.బిజెపి కి అమ్ముడు తప్ప వేరే తెలియదు.బీజేపీ అంటే పెట్టుబడి దారులకు కొమ్ము కాసే పార్టీ. బీజేపీ అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.
కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం. అంగన్ వాడిలా సమస్యలు తీర్చుతాం. కోటి కుటుంబాలకు కేసిఆర్ బీమా సౌకర్యం చేపడుతున్నాం. ఏ కారణం చేతైన ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో 5లక్షల భీమా డబ్బులు జమ చేస్తాం.ఇవన్నీ చేసుకుంటు పోతాం. ఎవడు ఎన్ని ట్రిక్కులు పన్నిన కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టుడు పక్కా? జనవరి నుంచి సన్నబియ్యం ఇచ్చుడు ఖాయం.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లన్ని తుస్సే. అవి అమలయ్యేది లేదు సచ్చేది లేదు. కేసిఆర్ వచ్చాక కార్మికులు రెండు షిఫ్టుల్లో పని చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే మన మేనిఫెస్టో నయం. ఎగబెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కేసిఆర్ ది. ఈమధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ లు పోయి బీజేపీ గెలిచింది. మునుగోడు లో కాంగ్రెస్ డిపాజిట్లు పోయి, బీజేపీ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ రెండు పార్టీలు ఒక్కటే. నిన్న మొన్నటి దాకా బీజేపీ లో.ఉన్న వివేక్, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరాడు.
మనల్ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.కాంగ్రెస్ గట్టిగ ఉన చోట బీజేపీ సపోర్ట్ చేస్తుంది.బిజెపి గట్టిగ ఉన్న చోట కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఢిల్లీ లో కొట్టుకుంటారు, తెలంగాణ లో ఎన్నికలు అయితే కలుస్తారు.ఏడు మండలాలు ఏపి లో కలిపింది బీజేపీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్. ఈ రెండు ఒక్కటే.