Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమే

-జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు… హామీలెట్లా అమలు చేస్తారు?
-మోదీ తలుచుకుంటే బీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులు మిగిలేవారా?
-ఏటా ఎకరానికి రూ.30 వేల సబ్సిడీ ఇచ్చే మోదీ గొప్పా? 10 వేలు మాత్రమే ఇచ్చే కేసీఆర్ గొప్పా?.. ఆలోచించండి
-వికారాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్?
-లక్షల ఎకరాల భూ దందాతో వేల కోట్లు సంపాదిస్తున్నవ్
-పేదల కోసం ఇండ్లు కట్టించలేవా?
-బీజేపీ అధికారంలోకొస్తే… పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం
-పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం
-పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ఫైర్…

రాష్ట్రంలో బీఆర్ఎస్ ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని అన్నారు. పంచాయతీలకు నిధులివ్వకుండా, ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులివ్వకుండా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో చేరితేనే ప్రజా ప్రతినిధులకు నిధులిస్తామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరతమ బేధం లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులిస్తున్నారని చెప్పారు. ‘‘మోదీ మీలాగే బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని ఆపర్ ఇస్తే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు.

‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, కార్యదర్శి ఉమారాణి, ఆకుల విజయ, పరమేశ్వర్ రెడ్డి, శక్తి కేంద్ర ఇంఛార్జీలు శ్యాం సుందర్, రమేశ్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదయ్య, కాకి శ్రీనివాస్, శివకుమార్, నర్సింహారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ ఏమన్నారంటే….

• కేసీఆర్ ఇయాళ జల్దీ లేచిండట. వాళ్ల దోస్త్ పంజాబ్ సీఎం వచ్చిండు. ఆయనను కొండ పోచమ్మ సాగర్ పంపి చాలా బాగుందన్పించిండు. కొండ పోచమ్మ సాగర్ కోసం ఎంతోమంది త్యాగం చేసి జాగాలిచ్చారు. ఆ పక్కనే మల్లన్న సాగర్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదని రైతులు ధర్నాలు చేశారు. ఒక రైతు అయితే ఆయన చితి ఆయనే పేర్చుకుని ఆహుతైపోయారు. అయినా సిగ్గు లేదు.

• తెలంగాణలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడుతున్నం. ప్రజా స్పందన చాలా బాగుంది. ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు భరోసా కల్పించడమే స్ట్రీట్ కార్నర్ మీటింగుల ఉద్దేశం. ఇప్పటిదాకా 1900 స్ట్రీట్ కార్నర్ మీటింగులు…

• బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు, బంధువులు మాత్రమే పదవుల్లో ఉండాలి. కొత్త నాయకులను ఎదగనీయరు. కాంగ్రెస్ పార్టీ పనైపోయింది. బీఆర్ఎస్ తో మిలాఖత్ అయ్యింది. ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

• బీఆర్ఎస్ ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమే. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు, అక్కడి ఊర్లలోకి గుంజకొచ్చిన ఘనత బీజేపీదే.

• బీఆర్ఎస్ లోకి వచ్చే వాళ్లంతా చెల్లని కాసులే. దోచుకున్న పైసలన్నీ పంచి పార్టీలోకి చేర్చుకుంటున్నరు. ఒక్కసారి వచ్చిన వాళ్లు మరి కేసీఆర్ ను కలవడం లేదు. వారణాసిలో మోదీని ఓడిస్తామని ఇట్లనే ఫ్లెక్సీలు పెట్టి పరువు పోగొట్టుకున్నరు. మూతపడే టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అనే కొత్త దుకాణం పెట్టి దేశమ్మీద పడ్డారు. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడం లేదు.

• రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రజకార్ల, కుటుంబ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను దించాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీ చేస్తున్న పోరాటాలను చూసి ఆదరిస్తున్నందునే ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించేందుకు యత్నిస్తున్నారు.

• తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రజలే ముఖ్యమని, అన్ని రాష్ట్రాలు సమానమనే భావనతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మూర్ఖుడు రాజ్యమేలుతున్నడు. అవినీతికి పాల్పడుతున్నడు. తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులిస్తున్నా సీఎం కేసీఆర్ సహకరిస్తలేరని ప్రధానమంత్రి చెప్పారు.

• కేంద్ర పథకాలు అమలు చేస్తే మోదీకి పేరొస్తుందని అడ్డుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్. తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టివ్వలే. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా?

• ఈ గ్రామంలో ఒక్కరికైనా ఉద్యోగమిచ్చారా? 80 వేల ఉద్యోగాలిస్తానని మాట తప్పారు. నోటిఫికేషన్ల పేరుతోనే కాలయాపన చేస్తున్నరు. 5 వేల కోట్ల బడ్జెట్ అవసరమైతే ఈ బడ్జెట్ లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. నిరుద్యోగ భ్రుతి ఇస్తానని పైసా ఇయ్యడం లేదు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలిచ్చుకుంటున్నడు.

• మోదీ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మూడు నెలల కాలంలో 2.16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా ఏక కాలంలో అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చిన ఘనత మోదీదే.

• రైతులకు రుణమాఫీ చేయడం లేదు. 25 వేల కోట్లు రుణమాఫీ అవసరమైతే 6 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కేసీఆర్ మాటలు నమ్మి రుణాలు కట్టకపోతే బ్యాంకోళ్లు రైతులకు కొత్త రుణాలియ్యడం లేదు. సొంత సొమ్మును జమ చేసుకుంటున్నారు. ఫ్రీ యూరియా ఇస్తానని మాట తప్పారు. 8 ఏళ్లలో అకాల వానలతో పంట నష్టపోయిన రైతులకు నయా పైసా పరిహారం ఇయ్యని దుర్మార్గుడు కేసీఆర్. కేంద్రం ఫసల్ బీమా యోజనతో రైతులకు ఆదుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయకుండా రైతులను మోసం చేస్తున్నరు.

• యూరియా పేరుతో కేంద్రం ఒక్కో బస్తాకు 2,185 రూపాయల సబ్సిడీ రైతులకు ఇస్తోంది. డీఏపీ పేరుతో 2,501 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఫాస్పెట్, కిసాన్ సమ్మాన్ భీమాతో కలిసి రెండు పంటలకు కలిపి ఒక్క ఎకరాకు రూ.30 వేలు రైతుకు మిగిలిస్తున్నడు. కేసీఆర్ రైతు బంధు 10 వేలు మాత్రమే ఇస్తూ అన్ని సబ్సిడీలు బంద్ చేస్తున్నరు. మోదీ గొప్పవారా? కేసీఆర్ గొప్ప వారా? ఒక్క సారి ఆలోచించారు. రైతులకు పంట గిట్టుబాటు దరను ఏటా పెంచుతున్న వ్యక్తి మోదీ.

• వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానవే. సుతిలి తాడు, రవాణా ఛార్జీలతోసహా రాష్ట్రానికి ఇఛ్చే బ్రోకరేజీ కమీషన్ పైసలన్నీ ఇచ్చేది కేంద్రమే. అయినా కేసీఆర్ తానే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.

• సిరిసిల్లలోని వీర్నపల్లిలో సర్పంచ్ భర్త చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదనే బాధతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రజా ప్రతినిధులకు కేంద్రం ఇచ్చే నిధులను తస్కరించిన దొంగ కేసీఆర్. పైగా ట్విట్టర్ టిల్లు ప్ర్రజా ప్రతినిధులకు బాకీ లేమంటూ చెప్పడం సిగ్గు చేటు.

• పైగా ఇతర పార్టీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామని బెదిరించడం సిగ్గు చేటు. నరేంద్రమోదీ మీలాగే అనుకుని… బీజేపీలో చేరితేనే గ్రామాలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరంటే ఒక్క ప్రజా ప్రతినిధి అయినా మిగిలేవారా?

• గ్రామ పంచాయతీలో టాయిలెట్లు, రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలు, వీధి దీపాలు, స్మశాన వాటికలు సహా అన్ని పనులకు నిధులిచ్చేది కేంద్రమే. జాతీయ రహదారులకు నిధులిస్తోంది, రేషన్ బియ్యం ఇచ్చేది, వ్యాక్సిన్ పైసలన్నీ కేంద్రానివే.

• పరిగిలో డిగ్రీ కాలేజీ లేదు. గ్రామాలకు రోడ్లు లేవు. మామిడి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ హామీకి దిక్కు లేదు. వికారాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలేమయ్యాయి. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయారు.

• రాష్ట్ర్టాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారు. 5 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు హామీలెట్లా అమలు చేస్తారు. కేసీఆర్ కు మళ్లీ ఓట్లేస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి చేతికి చిప్ప ఇస్తారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా వట్టి మాట. డిస్కంలకు ఫ్రీ కరెంట్ పైసలియ్యడం లేదు.

• రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ రద్దు చేయబోం. అవన్నీ అమలు చేస్తూనే ప్రజలకు ఉపయోగపడేలా కొత్త పథకాలను అమలు చేస్తాం. బీజేపీ అధికారంలోకి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం..

• నేను భయపడే వ్యక్తిని కాదు.. నా లక్ష్యం రామ రాజ్య స్థాపనే. గొల్ల కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. ఇకపై రాముడిని, శివుడిని, అయ్యప్పను తిడితే తన్ని తరిమేస్తాం. దైవ నిర్ణయం మేరకు నేను హిందువుగా పుట్టిన. నేను మతం మారితే దేవుడిని మోసం చేసినట్లే. ఎవరి మతం, ఎవరి ఆచారాలు వారివే. వాటిని గౌరవించాలి. నా హిందూ మతాన్ని, దేవుడిని తిడితే సహించే ప్రసక్తే లేదు. బతికినన్ని రోజులు దర్జాగా ధర్మం కోసం, సమాజ సేవ కోసం బతికేటోడే నా ద్రుష్టిలో గొప్ప వాడు. కేసీఆర్ లెక్క మందిని ముంచాలే.. కోట్లు సంపాదించాలనే బతుకు నా ద్రుష్టిలో వేస్ట్.

• నాకు జైలు కొత్త కాదు. 8 సార్లు జైలుకు పోయిన. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ బిడ్డ లెక్క దొంగ సారా దందా చేయడం లేదు. ప్రజల సొమ్ము దండుకుని వంద కోట్లతో కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేస్తోంది. చివరకు పత్తాల దందా కూడా చేస్తోంది. దేశంలో తెలంగాణ పరువు తీస్తోంది. ఇట్లాంటి వాళ్లకు ఎట్లా అధికారం ఇచ్చారని దేశమంతా నవ్వుకుంటోంది.

• ఈసారి ఒంటరిగా గెలవలేమనే భయంతో ఎంఐఎం, కమ్యూనిస్టులు, కాంగ్రెసోళ్లతో కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రజాకార్ల రాజ్యాన్ని తరిమి తరిమి కొడతాం. పేదల రాజ్యం తీసుకొస్తాం..

LEAVE A RESPONSE