– టీటీడీ పాలకవర్గ నిర్ణయాలపై బీజేపీ నేత నాగోతు ఫైర్
తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తులను జేబుదోపిడీ చేస్తున్న పాలకవర్గంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విరుచుకుపడ్డారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గించి, వారిని పరోక్షంగా ఎడారి మతాల వైపు మళ్లించే కుట్రను, హిందూ సమాజం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ ధరల నిర్ణయాన్ని తూర్పారపడుతూ ట్వీట్ చేశారు.
వీరు ధర్మ కర్తలా? రాబందులా? మనల్ని నిలువు దోపిడీ చేయడానికి ఎలాపోటీ పడుతున్నారో… భక్తులారా! ఇకనైనా కళ్ళుతెరవండి? మన సొమ్ము దోచుకొని ఏడారిమతాల అభివృద్ధి కి పాటుపడుతున్న, ఈ ప్రభుత్వంతో హిందూ సమాజానికి ప్రమాదం పొంచి ఉంది. పీఠాధిపతులు స్ఫందించాలి ! వ్యాపార దోరణిని అరికట్టాలి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
వీరు ధర్మ కర్తలా? రాభంధులా?? మనల్ని నిలువు దోపిడీ చెయ్యడానికి ఎలాపోటీ పడుతున్నారో… భక్తులారా! ఇకనైనా కళ్ళుతెరవండి? మన సొమ్ము దోచుకొని ఏడారిమతాల అభివృద్ధి కి పాటుపడుతున్న, ఈ ప్రభుత్వంతో హిందూ సమాజానికి ప్రమాదం పోంచివుంది, పీఠాధిపతులు స్ఫందించాలి ! వ్యాపార దోరణిని అరికట్టాలి ? pic.twitter.com/91IOHCTTZy
— Rameshnaidu Nagothu /రమేశ్ /रमेश नायडू (@RNagothu) February 22, 2022