-మౌలిక సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలం
-కనీస సౌకర్యల కోసం వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్
-అడవి తక్కెళ్ల పాడులోని టిడ్కో ఇళ్లను సందర్శించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, బిజెపి నేతలు
గుంటూరు: అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఇతర బీజేపీ ముఖ్య నేతలు గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. “కేంద్రం 22 లక్షల మేర ఇళ్లను ఏపికి ఇచ్చింది. 2020 నాటికి 9 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయింది. మిగిలిన పనులు పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఇప్పుడు ఎన్నికలముందు హడావుడిగా లబ్ధిదారులకు ఇచ్చారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలం. కేంద్రం ఇచ్చిన ఇళ్లల్లో సగం కూడా పూర్తి చేయకపోవడం దారుణం.
ప్రభుత్వ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తిచేసుకొని జనవరి 6వ తారీఖు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభం చేసి చోద్యం చూస్తూ కూర్చోవడం ఏమిటని నిలదీశారు. .వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి లబ్దిదారుడు పేర ముడులక్షల అరవై ఐదు వేల రూపాలు లోనుకు ఇంటిని బ్యాంక్ లో తనఖా పెట్టి లోను తీసుకున్న మునిసిపల్ అధికారులు. లబ్ది దారుడి ప్రమేయం లేకుండానే ఈ కార్యక్రమం జరగటం చూస్తే ప్రభుత్వం తరపున అధికారులు ఇంతటి దారుణానికి పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది.
మరి ప్రభుత్వం లబ్ది దారులకు 2 లక్షల రూపాయల ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. ఇప్పటికి 4192 ఇళ్ళు నిర్మాణం జరిగింది, 3875 ఇళ్ళు లబ్ది దారులకు అందించారని చెబుతున్న అధికారులు. కానీ ఇక్కడ వుండే లబ్ది దారులు మాత్రం 200 మంది లబ్ది దారులు మాత్రమే నివాసం ఉండటం గమనార్హం.”అన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్ పత్తిపాడు నియోజకవర్గ ప్రజాపోరు కన్వీనర్ అనుమోలు ఏడుకొండలు గౌడ్, మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, మాదాల సురేష్, దర్శి నరసింహారావు దేసు సత్యనారాయణ, రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు ఉన్నారు.