-సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టే అధికారం వారికి ఎవరు ఇచ్చారు?
-సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి కూడా న్యాయం చేయలేని -ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు?
-వైసిపి ప్రభుత్వ విద్వేష పూరిత ధోరణి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
గుంటూరు: బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి మరియు ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మకుటం శివ అధ్యక్షతన “ప్రజాపోరు” బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోని బళ్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియం లో జరిగింది. ముఖ్య అతిధులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేసారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బిజెపి విజయభేరి మోగించటంలో కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రస్ధానం ప్రస్తుతం 303 కు చేరిందని, ఎన్నికలలో 350 కి చేరటం ఖాయం. ధృడమైన నాయకత్వం లేని సమయంలో 2014 లో ప్రజలు మార్పును కోరుకోని 282 మంది ఎంపీలతో బీజేపీ కి అధికారం అందించారు. అప్పటినుండి కూడా సబ్ కే సాధ్ సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోంది.
అయిదేళ్ల అవినీతి రహిత పాలన ను చూసే 2019 లో 303 పార్లమెంటు స్ధానాలలో ప్రజలు బిజెపిని గెలిపించారు. ఈపదేళ్లలో బిజెపి తన మూల సిధ్ధాంతం అంత్యోదయ ను పాటిస్తూ ముందుకు వెళ్తోంది. దానికి కట్టుబడే ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా పేదవారికే పెద్దపీట వేస్తున్నాము.
నరేంద్రమోదీ అనేక సందర్భాలలో తాను కూడా పేదరికం నుండే వచ్చాను కాబట్టే వారి కష్టాలు తెలుసని, అందుకే సంక్షేమ కార్యక్రమాలలో వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. తన ప్రధానమంత్రిని కాదని ప్రధాన సేవకుడినని మోదీ తన మొట్టమొదటి పార్లమెంటు ప్రవేశ సమయంలో అన్నారు.
2014 కు ముందు పొరుగుదేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చినా కళ్ళప్పగించి చూసేవాళ్లం. కానీ నేడు, ఉగ్రవాదులు మనదేశం వైపు చూడటానికి కూడా భయపడటానికి సర్జికల్ స్ట్రైక్ కారణం. ఓకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు, రెండు రాజ్యాంగాలు ఉండటానికి వీలు లేదనే 370 అధికరణను బిజెపి దైర్యంగా తొలగించింది. ట్రిపుల్ తలాక్ కేవలం మహిళల జీవితాలకు ముడిపడిన అంశం కాదని, తల్లిదండ్రుల కడుపుకోతకు, కుటుంబాల సంక్షేమాలకు సంబంధించిన విషయమనే ఆలోచనతో మోదీ దానిని ధైర్యంగా రూపుమాపారు.
జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడి లాగా 12 లక్షల కోట్ల అప్పుతో ప్రజలను భస్మం చేశాడని, అతను రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏది కనబడ్డా తాకట్టు పెట్టి, లక్షలాది రూపాయల అప్పు తెస్తూ, ప్రజలపై పెనుభారాన్ని జగన్ మోపుతున్నాడని, చివరికి రాష్ట్రంలోని గనులను కూడా వదలలేదని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి పూజామందిరంలాంటి సెక్రటేరియట్ ను కూడా 350 కోట్లకు తాకట్టు పెట్టారని, ప్రజాధనంతో నిర్మించిన సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టే అధికారం వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని ఏరులై పారిస్తూ, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ, జేబులు నింపుకుంటున్న జగన్, తన సోదరీమణుల పుస్తెలు తెగిపోయినా పర్లేదనుకుంటున్నాడు. సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు?
వైసిపి ప్రభుత్వ విద్వేష పూరిత ధోరణి వల్ల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాక, పెట్టుబడులు రాక, యువతకు మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలే కరువయి, వలస వెళ్లవలసి వస్తోంది. రాజధాని డిజైన్ లేకపోయినా, డి.పి.ఆర్ ఇవ్వకపోయినా కూడా అమరావతే రాజధాని అని నిర్ణయం తీసుకుని కేంద్రం 2500 కోట్ల రూపాయలు కేటాయించింది. అనంతపురం నుండి రాజధానికి రహదారికై 29 వేల కోట్ల రూపాయలు, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ వంటి వాటికి రాజధాని ప్రాంతం అని నిర్ణయించే నిధులు అందించింది కేంద్ర ప్రభుత్వం.
ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ,25 పార్లమెంటు సీట్లు గెలుస్తామని జగన్ చెబుతున్నారు. చిలకలూరిపేట లో చెల్లని రూపాయి గుంటూరు లో చెల్లుతుందా? నెల్లూరు లో చెల్లని రూపాయి నరసరావుపేట లో చెల్లుతుందా?అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం చూసాం,కానీ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే లు, మంత్రులు ఎందుకు రాజీనామా లు చేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటవ తారీకున జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు.
ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్, బిజెపి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి మకుటం శివ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, రామకృష్ణారెడ్డి, చందు సాంబశివరావు, జూపూడి రంగరాజు, యడ్లపాటి రఘునాదబాబు, వల్లూరు జయప్రకాష్ నారాయణ, శనక్కాయల ఉమాశంకర్, పాతూరి నాగభూషణం, తులసి రామచంద్ర ప్రభు, శనక్కాయల అరుణ, మట్టా ప్రసాదు, ఈదర శ్రీనివాసరెడ్డి, పాటిబండ్ల రామకృష్ణ, స్వరూపరాణి, భీమినేని చంద్రశేఖర్, తోట రామకృష్ణ, పాలపాటి రవికుమార్, కొక్కెర శ్రీనివాస్, జగ్గారపు శ్రీనివాస్, యశ్వంత్, టివి రావు కిలారు దిలీప్, పాలపాటి రవికుమార్, ఆవుల నాగేంద్రయాదవ్, షేక్ రఫీ, కంతేటి బ్రహ్మయ్య, కన్నా రవిదేవరాజ్, దర్శనం శ్రీనివాస్, కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, వైవి సుబ్బారావు, ఉమామహేశ్వరవు, రావూరి నారాయణ, పోతురాజు వెంకట్, అనుమొలు ఏడుకొండలు మరియు గుంటూరు పార్లమెంట్ అసెంబ్లీ కన్వీనర్లు కోకన్వీనర్లు ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు
భారతీయ జనతా పార్టీ ఫిరంగిపురం మండల కోశాధికారి చింత శాంతి గారి ఆధ్వర్యంలో బేతపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి మరియు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో 30 మంది చేరారు వీరిలో ప్రముఖులు జుజ్జూరు వెంకట కోటేశ్వరావు , పామిశెట్టి విమల కుమారి పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు.