Suryaa.co.in

Political News

ముఖ్యమంత్రి అతి తెలివి మాటలు

– మీ బ్లాక్ మెయిల్ , మైండ్ గేమ్ రాజకీయాలను బిజెపి పార్టీ చాలా చూసింది
– పద్ధతి ప్రకారం బిల్లులు సమర్పించి ఉంటే, మోడీని పదేపదే దేబిరించాల్సిన అవసరం లేదు
– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో డబ్బు ముద్రణ

ముఖ్యమంత్రి జగన్‌ మొన్న గోదావరి వరద ప్రాంతాలలో సామాన్య ప్రజలతో మాట్లాడుతూ 20,000 కోట్లు కేంద్రం ఇస్తే తప్ప ఇది పూర్తి కాదు .డబ్బులు ముద్ర చేసేది వారే కదా వారు చేసి ఇవ్వచ్చు కదా ! అని అతి తెలివిగా సామాన్యుల దగ్గర, బిజెపిని ఎండగట్టాలని ఉద్దేశంతో, వేలకోట్ల రూపాయలు ఆయన అడిగినట్టుగా ఇవ్వడం లేదని అక్కసుతో మాట్లాడినట్టుగా అర్ధమవుతుంది.

డబ్బులు ఎవరు ముద్రిస్తారు? ఏ విధంగా ముద్రించబడతాయనే విషయం వేలాది,లక్షలాది కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెలియదు అనుకోవడం మన తెలివి తక్కువ తనం. ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ముద్రిస్తుంది. ఎంత కావాలంటే అం త ముద్రించు కోవచ్చు అనే అభిప్రాయం వచ్చేటట్టుగా ప్రజలను రెచ్చగొట్టాడు. ఇది చాలా దుర్మార్గం.

ఎందుకంటే డబ్బు ముద్రణ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చెయ్యదు. డబ్బులు దేశ ఆర్థిక పరిస్థితి, దేశ సంపద చిరిగిపోయిన నోట్లు , పనికిరాని నోట్లు , ఎన్ని ఉన్నాయో అవి లెక్కవేసి , జిడిపి లెక్కలు చూసి , ఆర్బిఐ గవర్నర్ ఏ డినామినేషన్ ఎన్ని కావాలో నిర్ణయం చేసి ముద్రిస్తుంటారు .

ఇదంతా చదువుకున్న వారికి , వ్యాపారం చేసే వారికి అందరికీ తెలుసు . కానీ నిన్న ఆయన తో మాట్లాడుతున్న సామాన్య మహిళలకు తెలియకపోవచ్చు .వారిలో ’ పాపం ముఖ్యమంత్రి గారు మనకు డబ్బులు ఇవ్వాలనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ,మోడీ గారు ఒప్పుకోవడం లేదు ఇవ్వడం లేదు ‘ అన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశారు. ఆయన మాటల మర్మం అదే.

పోలవరానికి 100% కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తుంటే, ఖర్చు పెట్టడం మీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక .. మీరు వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో కేవలం 3 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు .దీనిని బట్టి మీ యొక్క పని సామర్థ్యం, మీ రివర్స్ టెండరింగ్ అర్థమవుతుంది.

పోలవరం ప్రాజెక్టు లోటుపాట్లు గురించి హైదరాబాద్ ఐఐటి కాలేజీ వారు రిపోర్ట్ చూశారు కదా ! ఇంకైనా మీకు అర్థం కాలేదా ! పోలవరం ప్రాజెక్టు విషయంలో, మీ ప్రభుత్వ చేతకాని తనాన్ని.. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు అనే నెపం రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది .

మీ ఇష్ట ప్రకారం కేంద్రం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వదు. ఇప్పటికే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, కేంద్రం కొన్ని విషయాల్లో మీకు వెసులుబాటు ఇచ్చి , ప్రజలలో విమర్శలకు గురి అవుతుంది . ప్రధానమంత్రి గారి మీద ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో మీ తేగడం మాటలు చూస్తుంటే.. మీ ఇష్ట ప్రకారం ప్రభుత్వం నడవాలని మీరు అనుకున్నట్టుగా, లక్షల కోట్లు దోచి పెట్టాలని మీ అభిప్రాయం ఉన్నట్టుగా ఉంది . ఇది దేశం. పద్ధతి ఉంటుంది. గుర్తుంచుకోండి. మీ బ్లాక్ మెయిల్ , మైండ్ గేమ్ రాజకీయాలను బిజెపి పార్టీ చాలా చూసింది . ఈ విధంగా మాట్లాడుతుంటే, మీ చేతకానితనం బయటపడుతుంది తప్ప ఇంకొకటి కాదు.

మీకు 2,900 కోట్లు పోలవరం బిల్లు ఇవ్వాలని మీరు ప్రజల్లో చెప్పారు.మీరు సక్రమంగా పద్ధతి ప్రకారం బిల్లులు సమర్పించి ఉంటే, మోడీ గారిని పదేపదే దేబిరించాల్సిన అవసరం లేదు. దానికి ఒక పద్ధతి ఉందని తెలియదా ? . పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీరు పెట్టిన బిల్లులు చూసి , మీరు చేసిన పని సక్రమంగా ఉందని వారు నిర్ధారించిన తర్వాత వెంటనే బ్యాంకుల ద్వారా, మీకు డబ్బులు జమ అయ్యే పరిస్థితి గతంలో చూశారు కదా !

ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ? దీని వల్ల మీరు చులకన కావడం.. మోడీ గారిని మీరేదో ప్రజల్లో చులకన చేసామని భావించడం, మీ తెలివి తక్కువ తనం. ఇంతకుమించి ఇంకేమీ కాదు . ప్రభుత్వం మీ మనసుకు నచ్చినట్టు నడవదు . సూర్యుడి మీద ఉమ్మేద్దాం అనుకుంటే అది మీ మీదనే పడుతుంది .

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE