బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై నిన్న రాజధానిలో జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపుమేరకు గుంటూరు లాడ్జి సెంటర్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున లాడ్జి సెంటరుకు చేరుకొని లోక్ సభ సభ్యులు నందిగం సురేష్ కి, వైసిపి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్ల కార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు,ఈ సందర్భంలో పోలీసులకు యువమోర్చా మరియు మహిళా నాయకులకు వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తోట రామకృష్ణ ఇరువురు మాట్లాడుతూ వైసిపి చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయని, చివరకు మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాజధాని రైతుల 1200 వ రోజు ధర్నాకు నిన్న మద్దత్తు ఇచ్చి వచ్చే క్రమంలో ఉద్దండ్రాయుని గ్రామ సమీపంలో కొంతమంది నందిగం సురేష్ అనుచరులు రాడ్డులు, కర్రలతో దాడిచేసి ఆయన కారు ధ్వసం చేయడం, కొంతమంది బిజెపి నాయకులని కొట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, ఈరోజు మేము గుంటూరులో శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో ఈరోజు పోలీసులు వైసిపి కి మద్దత్తుగా వైసిపి కార్యకర్తలుగా వ్యవహరిస్తు బిజెపి యువమోర్చా నాయకుల పై మాన్ హ్యాండ్లింగ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. ఇలా భౌతిక దాడులు చేయడం దౌర్జన్యం చేయడం,అదిరించి, బెదిరించడం వలన రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవలసి వుంటుందని మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వమే దాడులు చేయిస్తుందని రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు అదేవిధంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల అరుణ, పశ్చిమ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గాల కన్వీనర్లు తోట రామకృష్ణ , శనక్కాయల ఉమాశంకర్, ఈమని మాధవరెడ్డి, చరక కుమార్ గౌడ్, అప్పిశెట్టి రంగా, భాస్కర్, పూర్ణచంద్రరావు, పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, ఆవుల రామకోటేశ్వరరావు, ఆవుల నాగేంద్ర, కొక్కెర శ్రీనివాసరావు, మైలా హరిక్రిష్ణ, దారా అంబేద్కర్, తుల్లిమిల్లి రామకృష్ణ, మంత్రి సుగుణ, మేరీ సరోజినీ, నాగమల్లేశ్వరి, కోలా రేణుకాదేవి, ఏలూరి లక్ష్మి, తోట శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాద్, వరికుటి సుధాకర్ రావు, నాగుల్ మీరా, పోతురాజు వెంకట్, శేషగిరి, రామచంద్రరావు, మల్లికార్జునరావు, పురుషోత్తం, ప్రసాద్ భాస్కర్, రాకేష్, రాజేష్ నాయుడు, దుర్గారావు, రాయ నాగేశ్వరావు, స్టాలిన్, జార్జ్, సాంబయ్య, అంకాలశ్రీను, కుమార్, దాసరి రమేష్, రమణ, సుధాకర్, సుబ్బారావు, చలపతిరావు, ఇండ్ల శ్రీధర్ వివిధ మండల అధ్యక్షులు, మోర్చా పదాధికారులు పాల్గొన్నారు .
శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న బిజెపి నేతల పై పోలీసులు జులుం ప్రదర్శించారు. రోడ్డుపై నిరసన చేస్తున్న నేతలను ఈడ్చుకుంటు వెళ్లడం, జరిగింది పోలీసుల దుశ్చర్యపై బిజెపి శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు ఈక్రమంలో బిజెపి యువమోర్చా నేత కొక్కెర శ్రీనివాస్ యాదవ్ రోడ్డు మీద బైఠాయించి నిరసన చేపట్టగా పోలీసులు కాళ్లతో తొక్కడం, చేతులతో అతన్ని రక్కడం వలన అతనికి ఛాతీ క్రింద భాగంలో గాయమైంది, అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి జి.జి.హెచ్ కి తరలించగా MLC గా కేసు క్రింద అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు చేయడం జరిగింది. ఈ క్రమంలో యువమోర్చా అధ్యక్షుడు మైలా హరికృష్ణ ను పోలీసులు అరండల్ పేట పీఎస్ కు తరలించారు అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేయడం జరిగింది.