Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సంఘీభావం

-ఉద్యోగుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన జీవీఎల్

• రాష్ట్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరి తో  ఉద్యోగులను అనేక విధాలుగా PRC విషయంలో మోసం చేస్తూ, వారి భవిష్యత్తును అంధకారంలో పడవేసిందని, తాము ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంఘీభావం తెలియచేస్తున్నామని అన్నారు.

• గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను తమ అవసరాలకు వాడుకుని వదిలేసే విధానాలనే అనుసరిస్తూ ఉన్నాయని, ఉద్యోగ సంఘాలు బీజేపీని సమర్థిస్తే ,తాము వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని, అపుడు మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె సంతోషం గా ఉండటం  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యపడుతుంది అన్నారు.

• రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రచార ఆర్భాటాలకై వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఉద్యోగస్తుల సమంజసమైన డిమాండ్లను తీర్చటం కష్టమైన విషయం కాదని చురకలంటించారు.

• రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల రూపంలో అవసరం లేని అనేకమందిని నియమించుకొని వారి జీత భత్యాలకై చేసే దుబారా ఖర్చు వంటివి నియంత్రించుకుంటూ ఉద్యోగస్తుల సమంజసమైన  కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేసారు.

• కేంద్ర స్థాయిలో ప్రభుత్వాధినేతలు, నాయకులు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో వారి వేతనాల్లో కోత విధించుకుంటే, 2016 లో పెంచబడిన ఎమ్మెల్యేల జీతభత్యాల ద్వారా రాష్ట్ర ఖజానాపై యాభై కోట్ల అదనపు భారం పడిందని, అటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగుల న్యాయపరమయిన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేసారు.

తమ ఆదాయం పెంచుకోవడం కోసం అనేక రకాలైన అడ్డదారులు తొక్కుతున్న టువంటి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కేవలం ఉద్యోగ సంఘాల విషయాల్లోనే రాష్ట్రానికి ఆదాయం లేక సరైన PRC ఇవ్వలేము అనడం దారుణమైన విషయం అని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE