-హిందువులకు బీజేపీ మాత్రమే ప్రతినిధి కాదు
-కేసులో బీజేపీ కి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుంది
-మాణిక్యం ఠాగూర్ సమన్ల కు చట్టపరంగా బదులిస్తా
-టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
బీజేపీ శిక్షణా శిబిరాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలగొట్టింది బీజేపీ.
ప్రభుత్వాలు ఎలా కూల గొట్టాలి అని మూడు రోజుల శిక్షణా శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నట్టుంది. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ఎలా తిట్టాలో ఈ శిక్షణా శిబిరాల్లో నేర్పుతున్నట్టుంది. అభివృద్ధి గురించి చెప్పి ఓట్లడిగే పరిస్థితి బీజేపీ కి లేదు.ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లో టీ ఆర్ ఎస్ కు బీజేపీ కి తేడా ఉంది.
బీజేపీ ఎమ్మెల్యేల ను చేర్చుకుంది ప్రభుత్వాలు కూల గొట్టడానికి.ఇక్కడ మేము రాజ్యాంగం 10 వ షెడ్యూల్ ప్రకారం టీ ఆర్ ఎస్ శాసనసభా పక్షం లో విలీనమయ్యాము.మేము టీ ఆర్ ఎస్ లో చేరడం వల్లే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ లేదు.హిందువులకు బీజేపీ మాత్రమే ప్రతినిధి కాదు.
మేము హైందవ సంప్రదాయాలు పాటించడం లేదా?ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో బీజేపీ కి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుంది.తమ పాత్ర లేదని అంటున్న బీజేపీ నేతలు కోర్టు గడప ఎందుకు తొక్కుతున్నారు.స్వామీజీ ల పేరు తో టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు.
బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడింది. మాణిక్యం ఠాగూర్ సమన్ల కు చట్టపరంగా బదులిస్తా.కొన్ని పార్టీ లు కాలానుగుణంగా అదృశ్య మవుతాయి.. అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ నడిపించే సమర్ధ నేత ఎవ్వరూ లేరు.