– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మినారాయణ
భారతీయ జనతా పార్టీ అఖిల భారత పార్టీ. ‘గావ్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి 2,70,000 గ్రామ పంచాయతీలకు, 7లక్షల గ్రామాలకు, అర్బన్ ఆవాసాలకు కూడా తరలివెళ్లాలనేది పార్టీ నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమం తెలంగాణలొ 12,769 గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ విలేజీలకు, 5,564 గ్రామాలకు వెరసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35వేల పొలింగ్ బూత్ లన్నింటికీ కూడా పార్టీ శ్రేణులు తరలివెళ్ళనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నుండి అగ్రశేణి నాయకత్వంతో పాటు, సమర్థత ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు తరలివెళ్లడం జరుగుతుంది.
కార్పోరేషన్ లో అయితే డివిజన్ వదిలి ఇంకో డివిజన్, గ్రామాల్లో అయితే గ్రామం వదిలి మరో గ్రామానికి ప్రవాసీ కార్యకర్తలు వెళ్తారు. 24 గంటల పాటు గ్రామంలో ఉండి, కార్యకర్తలతో ముచ్చటించి, బూత్ ను సమీక్షించి బలోపేతం చేస్తరు. కొన్నిచోట్ల ఉన్న ఖాళీలను భర్తీ చేసి, మిగిలిపోయిన బూత్ కమీటీలను ఏర్పాటు చేస్తరు.
అన్ని సామాజికవర్గాల పెద్దలను, సమాజాన్ని ప్రభావితం చేసే నాయకులను కలుస్తారు. ఆధ్మాత్మిక కేంద్రాల్లో దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా నరేంద్రమోదీ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అభివృధ్ది, కేంద్ర ప్రభుత్వ లభ్దిదారులను కలిసి, ఆ గ్రామానికి కేంద్రం ద్వారా జరిగిన అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ పంచాయతీలలో, నగరాల్లో, పట్టణాల్లో ప్రజలకు వివరిస్తారు.
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణలో,.. దేశ వ్యాప్తంగా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్ణయించడం జరిగింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 17కోట్ల ఓట్లు సాధించింది.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 22కోట్ల ఓట్లు సాధించింది. రాబోయే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఓట్లలో 51శాతం ఓట్లు సాధించాలనేదే లక్ష్యం.
ప్రతీ బూత్ లో కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి బూత్ కి వెళ్లే కార్యకర్తలు మొదటి విడతలో 24 గంటలు ఉంటారు. ఇదే నెలలో మరోసారి 12 గంటలు, మార్చిలో 6 గంటలు గ్రామాల్లో ఉంటారు. ఇలా మూడు విడతల్లో ఆ గ్రామాల్లో అనుబంధాన్ని, గ్రామానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులతో, అవగాహనతో మార్గదర్శనం చేయడం జరుగుతుంది.